
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది – సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుక!
- ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఉదయం 9 గంటలకు హిందూ సంప్రదాయంలో వివాహం, సాయంత్రం కొడవ సాంప్రదాయంలో మరో వేడుక!
- సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా వంటి సెలబ్రిటీలు హాజరు – ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్!
- మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో గ్రాండ్ రిసెప్షన్ – సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు ఒక్కటయ్యారు! విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం గురించి సంచలన విషయాలు ఇప్పుడు చూద్దాం. అభిమానులకు పండగే పండుగ!
రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా విరోషి పెళ్లి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎట్టకేలకు ఒక్కటవుతున్నారు. వీరి మ్యారేజ్ గురువారం చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ ఇద్దరు మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నారు. అతికొద్ది మంది బంధుమిత్రులు, సెలబ్రిటీల సమక్షంలో విరోషి(విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా) ఒక్కటి కావడం విశేషం.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్ ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఉదయం 9 గంటల నుంచి పది గంటల మధ్యలో రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయ్. అయితే వీరి మ్యారేజ్‌ని రెండు సాంప్రదాయల ప్రకారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ జరగ్గా, సాయంత్రం కొడుగు(కొడవ) సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకోబోతున్నారు. కొడవ అనేది రష్మిక మందన్నా(కన్నడ) వారి సాంప్రదాయం కావడం విశేషం.
రెండు సాంప్రదాయాలలో వివాహం – ఫోటోలు వైరల్
అయితే పూర్తి ప్రైవేట్ ఈవెంట్‌గా జరుగుతున్న వీరి మ్యారేజ్ వేడుకకి సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా విజయ్, రష్మిక జాగ్రత్త పడ్డారు. అతిథులకు కండీషన్స్ కూడా పెట్టారు. అయినా చిన్న చిన్న వీడియో క్లిప్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ మ్యారేజ్ ఫోటోలను ఈ జంట అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారనేది చూస్తే.. సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్ వంటి వారు హాజరైనట్టు తెలుస్తోంది. ఆనంద్ దేవరకొండ, విజయ్ ఫ్యామిలీ, వారి దగ్గరి బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారట. అలాగే రష్మిక మందన్నా దగ్గరి బంధువులు మాత్రమే వీరి మ్యారేజ్‌కి హాజరయ్యారు. చాలా లిమిటెడ్‌లో ఫ్రెండ్స్ ఉన్నట్టు సమాచారం. అలాగే అతికొద్ది మంది కార్పొరేట్ దిగ్గజాలు కూడా పాల్గొంటారని టాక్.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా `గీత గోవిందం` లో తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత `డియర్ కామ్రేడ్`లో మరోసారి జోడీ కట్టారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల రిలేషన్ అనంతరం గురువారంతో ఒక్కటయ్యారు. కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఇక వీరి రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరగబోతుంది. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, కార్పొరేట్లు ఈ రిసెప్షన్‌కి హాజరయ్యే అవకాశం ఉంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరి రిసెప్షన్ గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


