|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫిక్స్! వెడ్డింగ్ కార్డ్ లీక్, ఫ్యాన్స్ పండగ!

Published: 16-02-2026, 5:35 AM
షాకింగ్: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫిక్స్! వెడ్డింగ్ కార్డ్ లీక్, ఫ్యాన్స్ పండగ!
  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త వైరల్: ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లో వివాహం!
  • మార్చి 4న హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు!
  • వెడ్డింగ్ కార్డ్ లీక్ కావడంతో అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువ!
  • విజయ్ దేవరకొండ పేరు మీద ఆహ్వాన పత్రిక: కొత్త జీవితానికి ఆశీస్సులు కోరుతూ ప్రకటన!

టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్! అభిమానులకు ఇది నిజంగా పండగే. అసలు వెడ్డింగ్ కార్డ్ సంగతేంటో చూద్దాం!

విజయ్, రష్మికల పెళ్లి ఫిక్స్?

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక(Rashmika Mandanna) పెళ్లికి సిద్ధమైనట్లు గత రెండు మూడు నెలలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఇద్దరు సైలెంట్‌గా ఉన్నప్పటికీ పలు విషయాలపై మాత్రం హింట్ ఇస్తున్నారు. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి విషయంలోనూ ఆ సీక్రెట్‌ను మెయింటైన్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, విజయ్, రష్మికి పెళ్లికి సంబంధించిన కార్డ్ నెట్టింట సంచలనంగా మారింది. వెడ్డింగ్ కార్డ్ ప్రకారం వీరిద్దరు ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారట. సంప్రదాయబద్దంగా.. జరనున్న ఈ పెళ్లి వేడుక రాజస్థాన్‌లో జరగబోతుంది.

ఇక పెళ్లి అనంతరం.. హైదరబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం మార్చి 4న సాయంత్రం 7గంటలకు తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. విజయ్ దేవరకొండ తన పేరు మీద ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తూ తన కొత్త జీవిత ప్రయాణానికి అందరి ఆశీస్సుతు కావాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా మారిన విజయ్, రష్మిక వీడియోలు వైరల్ కావడం, రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు ఏకంగా వీరిద్దరి పెళ్లి కార్డ్ లీక్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంగ్రాట్స్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!

రిసెప్షన్ ఎక్కడ? ఎప్పుడంటే?

విజయ్, రష్మికల పెళ్లి గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.