
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు ఉదయ్ పూర్ లో ఫిబ్రవరి 26న జరిగాయి.
- పెళ్లి తరువాత రణబాలి షూటింగ్‌లో పాల్గొన్న ఈ జంటకు చిత్ర బృందం ఘనంగా స్వాగతం పలికింది.
- రణబాలి చిత్రంలో విజయ్, రష్మిక భార్యాభర్తలుగా నటిస్తున్నారు; ఇది వారిద్దరి కాంబినేషన్‌లో మూడవ సినిమా.
- సెప్టెంబర్ 11న రణబాలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి తర్వాత రణబాలి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. చిత్ర బృందం వారికి ఘనంగా స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్, రష్మికల పెళ్లి వేడుక
Ranabaali: టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న (Rashmika Mandanna)ఇటివల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయ్ పూర్ లో పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ జంట తమ పెళ్ళి కోసం కొద్దిరోజులు తమ సినిమా షూటింగ్ పనులకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత తిరిగి యధావిధిగా సినిమాలో షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. నేపథ్యంలోనే ఈ కొత్తజంట తిరిగి రణబాలి(Ranabaali) సినిమా షూటింగ్ కి హాజరు కావడంతో చిత్ర బృందం కొత్త జంటకు ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
రణబాలి జయమ్మ తిరిగి సెట్ లోకి అడుగు పెట్టారని తెలియజేస్తూ ఈ కొత్త జంట చేత కేక్ కట్ చేయించి అభినందనలు తెలియజేశారు. ఇక విజయ్ దేవరకొండ రష్మిక మందన్న రణబాలి సినిమాలో జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఈ చిత్రం ముచ్చటగా మూడో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా పెళ్లి తర్వాత మొదటిసారి వీరిద్దరూ సెట్స్ లోకి అడుగు పెట్టడంతో కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తూ కేక్ కట్ చేయించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారని విజయ్ దేవరకొండ రణబాలిగా, రష్మిక జయమ్మ అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 11న రాబోతున్న రణబాలి..
ఇక విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్లో ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ సినిమాల తర్వత వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా నటించిన మొదటి సినిమా కావటం విశేషం. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది .ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు.
రణబాలి సెట్‌లో ఘన స్వాగతం
Ranabaali – Jayamma @TheDeverakonda – @iamRashmika
Team #Ranabaali wished the newly weds on sets with a celebration ✨
Grand release worldwide on September 11th 🔥 @Rahul_Sankrityn @MythriOfficial #ArnoldVosloo @AjayAtulOnline @nirav_dop … pic.twitter.com/yjdMLTEWkE
సెప్టెంబర్ 11న విడుదల
— Mythri Movie Makers (@MythriOfficial) April 11, 2026
తాజాగా చిత్ర బృందం రాయలసీమకు సంబంధించిన షెడ్యూల్ చిత్రీకరణను ఇటీవల పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూటింగ్ కి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. రాయలసీమ యాసలో విజయ్ దేవరకొండ చెప్పే మాస్ డైలాగులు కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఈ సినిమాతో విరోష్ జంట కచ్చితంగా బ్లాక్ బాసర్ అందుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityn)దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ, రష్మికల కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిద్దాం. సెప్టెంబర్ 11న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఎదురుచూద్దాం.


