|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మికతో పెళ్లి క్యాన్సిల్? మరో అమ్మాయితో విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ లీక్!

Published: 12-02-2026, 3:36 AM
రష్మికతో పెళ్లి క్యాన్సిల్? మరో అమ్మాయితో విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ లీక్!
  • విజయ్, రష్మికల పెళ్లి వార్తల మధ్య విజయ్ మరో యువతితో క్లోజ్‌గా ఉన్న ఫోటోలు వైరల్.
  • గీతా గోవిందం సినిమా సమయంలో విజయ్, రష్మికల మధ్య ప్రేమ మొదలైందని పుకార్లు.
  • విజయ్ దేవరకొండ బ్రెజిల్ స్నేహితురాలు విన్నీతో పదేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడని సమాచారం.
  • రష్మికతో పెళ్లి రూమర్స్‌పై విజయ్ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో విజయ్ దేవరకొండ మరో యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏమిటంటే…

రష్మిక, విజయ్ లవ్ స్టోరీలో అసలు నిజం?

Vijay – Rashmika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రూమర్డ్ జంటగా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna). 2018లో వచ్చిన ‘గీతా గోవిందం’ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం స్నేహంగా మారి.. ఆఖరికి ప్రేమగా మారిందని.. 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా సమయంలో వీరి బంధం మరింత బలపడిందనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు వీరిద్దరూ కలసి వెకేషన్ లకు వెళ్ళిన ఫోటోలు బయటకు రావడం.. అటు విజయ్ ఇంట్లో రష్మిక కనిపించడం.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇక ఇద్దరి మధ్య బంధం బలంగా మారిందనే వార్తలు వినిపించాయి.

మరోవైపు ఈ రూమర్స్ అన్నింటిని నిజం చేస్తూ గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. పైగా ఈనెల 26వ తేదీన ఉదయపూర్ లోని ఒక చారిత్రాత్మక కోటలో వీరిద్దరి వివాహం జరగబోతుందని, వీరి వివాహానికి డచ్ నుండి ప్రత్యేకంగా గులాబీలు కూడా తెప్పిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మార్చి 4వ తేదీన హైదరాబాద్ వేదికగా వీరి రిసెప్షన్ జరగనుంది అని, ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారు అంటూ ఇలా రోజుకొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇలాంటి సమయంలో తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో కనిపించి సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఒక యువతితో విజయ్ సన్నిహితంగా కనిపిస్తున్న ఆ ఫోటోలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్స్ ఈమె విజయ్ దేవరకొండ మాజీ ప్రియురాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇంకొంతమంది రష్మిక మందన్నతో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు వేళ.. ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో యువతితో చనువుగా ఉన్న ఫోటోలు బయటకు రావడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ మరో యువతితో డేటింగ్?

ఇకపోతే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. విజయ్ దేవరకొండ బ్రెజిల్ కి చెందిన తన స్నేహితురాలు విన్నీతో కలిసి దాదాపు పది సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నాడట. రష్మిక కేవలం స్నేహితురాలు మాత్రమే అని.. విన్నీతోనే ఆయన జీవితం పంచుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా కరోనా సమయంలో ఆమెను కలవడానికి విజయ్ వెళ్లారని..ఆమె కుటుంబ సభ్యులు కూడా హైదరాబాద్ కి వచ్చారానే వార్తలు వినిపిస్తున్నాయి కానీ వీటిలో ఎటువంటి నిజం లేకపోవడం గమనార్హం.

వైరల్ అవుతున్న ఫోటోల వెనుక కథేమిటి?

అయితే మరోవైపు విజయ్ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఈ యువతి పేరు వర్జీనీ అని.. 2016లో విజయ్ హీరోగా వచ్చిన తొలి చిత్రం పెళ్లి చూపులు సమయంలో ఆమె ఒక చిన్న పాత్రలో నటించిందని, ఆ సినిమా తర్వాత వారి ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారిందని.. అంతే తప్ప వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారాలు నడవలేదు అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఏది నిజమో తెలియదు కానీ పెళ్లి వార్తలు సమయంలో కొంతమంది కావాలనే ఇలా విజయ్ దేవరకొండ పాత ఫోటోలను బయటకు తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి అంటూ వార్తలు వస్తున్న సమయంలో ఇలాంటి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Tags tollywood Vijay Rashmika marriage Share

మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం విజయ్ మరో యువతితో ఉన్న ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.