|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమన్నా ఎంపికపై భగ్గుమన్న వివాదం! మైసూర్ శాండిల్ సోప్ ప్రకటనలో అసలేం జరిగింది?

Published: 12-02-2026, 3:36 AM
తమన్నా ఎంపికపై భగ్గుమన్న వివాదం! మైసూర్ శాండిల్ సోప్ ప్రకటనలో అసలేం జరిగింది?
  • తమన్నాను ఎంపిక చేయడానికి వ్యాపార కారణాలు ఉన్నాయని మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు.
  • స్థానిక నటీమణులు ఇతర బ్రాండ్లతో అనుబంధం కలిగి ఉండటం ఒక కారణం.
  • 2030 నాటికి రూ.5000 కోట్ల టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • తమన్నాకు పాన్ ఇండియా క్రేజ్ ఉండటం కలిసొచ్చే అంశం అని ప్రభుత్వం భావిస్తోంది.

మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియాను ఎంపిక చేయడం కర్ణాటకలో దుమారం రేపింది. ఈ ఎంపికకు గల కారణాలను మంత్రి ఎంబీ పాటిల్ వెల్లడించారు. స్థానిక నటీమణులు అందుబాటులో లేకపోవడమే కారణమని ఆయన తేల్చి చెప్పారు.

తమన్నా ఎంపికపై కర్ణాటకలో వ్యతిరేకత ఎందుకు?

Tamannaah:చిత్ర పరిశ్రమలో తమ అద్భుతమైన నటనతో నటీనటులుగా మంచి పేరు సొంతం చేసుకున్న ఎంతోమంది హీరో హీరోయిన్లు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగా ఆదాయాన్ని పెంపొందించుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇలా కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు.. ఈ నేపథ్యంలోనే “కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్” (KSDL) కి చెందిన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా భాటియా(Tamannaah Bhatia) ను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే

అయితే ఈమెను ఎంపిక చేసుకోవడంపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇంతమంది కన్నడ నటీనటులు ఉండగా తమన్నానే ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది. దీంతో కర్ణాటక రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ ఈ అంశంపై మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. దీనికి వ్యాపార పరమైన కారణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

ఎంబీ పాటిల్ వివరణ: తమన్నా ఎంపిక వెనుక కారణాలివే!

ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ..” మైసూర్ శాండిల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా భాటియాను ఎంపిక చేసుకోవడానికి వ్యాపార కారణాలు ఉన్నాయి. స్థానిక నటీమణులు ఇప్పటికే ఇతర బ్రాండ్లతో అనుబంధమై ఉన్నారు. దీపిక పదుకొనే పేరును పరిశీలించినప్పటికీ ఆమె డిమాండ్ చేసిన పారితోషకం కారణంగానే దీపికా పదుకొనేను తీసుకోలేదు. ఇక ఈ మైసూర్ శాండిల్ సోప్ అమ్మకాలు కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా ఒక శాతం మార్కెట్ ఉంది. అటు ఉత్తర భారత దేశంలో 8 శాతం, తెలంగాణలో 18% మార్కెట్టు ఉంది.

ఇక 2030 నాటికి రూ.5000 కోట్ల టర్నోవర్ సాధించడమే మా లక్ష్యం. అందుకే పాన్ ఇండియా క్రేజ్ , కోట్లాది మంది సోషల్ మీడియా ఫాలోవర్లు బ్రాండ్ ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడతారని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టే తమన్నాను ఎంపిక చేసుకోవడం జరిగింది” అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా తమన్నా అసలైన ఎంపిక అని కర్ణాటక ప్రభుత్వం అభిప్రాయంగా కర్ణాటక మంత్రి చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికైనా ఈ వివాదం కి పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.

2030 నాటికి 5000 కోట్ల టర్నోవర్ లక్ష్యం

ఇదిలా ఉండగా మరొకవైపు సాధారణంగా తమన్నా భాటియా ఇలాంటి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తే మాత్రం రూ .2 లేదా 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ ఈ ప్రభుత్వ సోప్ ను ఆమె ప్రమోట్ చేస్తున్నందుకుగాను ఏకంగా రూ.6.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి ఒక్కో మూవీకి కూడా ఆమె ఇంత తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు రెట్టింపు పేమెంట్ తీసుకోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సొంత రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాదు పైగా ఇంత రెమ్యూనరేషన్ అనేది కూడా కన్నడ ప్రజలకు మరింత మండేలా చేసింది. దీనితోనే పెద్ద రచ్చ మొదలుపెట్టడంతో కర్ణాటక మంత్రి దిగివచ్చి క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా ఈ వివాదం సద్దమణుగుతుందేమో చూడాలి.

మొత్తానికి తమన్నా ఎంపిక వెనుక ఉన్న కారణాలను మంత్రి ఎంబీ పాటిల్ వివరించడంతో ఈ వివాదానికి ముగింపు వస్తుందో లేదో చూడాలి. ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.