|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటుడు విజయ్ దేవరకొండకు బిగ్ షాక్.. SC, ST అట్రాసిటీ కేసు

Published: 22-06-2025, 4:26 AM
నటుడు విజయ్ దేవరకొండకు బిగ్ షాక్.. SC, ST అట్రాసిటీ కేసు

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండకు షాకింగ్ న్యూస్. గిరిజన తెగలను కించపరిచే వ్యాఖ్యల కారణంగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి.

Key Points

1

విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.

2

గిరిజన తెగలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ.

4

సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు.

గిరిజన సంఘాల ఫిర్యాదు

సినీ నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్(Rayadurgam Police Station) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పలు గిరిజన సంఘాల ఫిర్యాదు నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయని వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆరోపించాయి. దీనిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం పలు గిరిజన సంఘాల నాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రాయదుర్గం పోలీసులు సినీ నటుడు విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు

పోలీసుల కేసు నమోదు

విజయ్ దేవరకొండపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన సినీ పరిశ్రమలో తీవ్ర వివాదాన్ని సృష్టించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.