|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘రణబాలి’ రిలీజ్ వాయిదా షాక్! మేకర్స్ మాస్ హింట్!

Published: 30-06-2026, 3:43 AM
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'రణబాలి' రిలీజ్ వాయిదా షాక్! మేకర్స్ మాస్ హింట్!
  • రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ విడుదల వాయిదా ఖాయం. అభిమానులకు బిగ్ షాక్!
  • సెప్టెంబర్ 11న రావాల్సిన సినిమా రిలీజ్ డేట్ పోస్టర్లో మిస్సింగ్. మేకర్స్ హింట్!
  • విజయ్-రష్మిక మందన్నల మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామాపై భారీ అంచనాలు.
  • మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కోసం విజయ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూపులు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ‘రణబాలి’ మూవీ విడుదల వాయిదా పడిందా? మేకర్స్ ఇచ్చిన మాస్ హింట్ వెనుక అసలు నిజం ఏంటి? అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ వార్తపై పూర్తి వివరాలు ఇక్కడ!

‘రణబాలి’ వాయిదా.. మేకర్స్ హింట్ వెనుక మర్మం!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రణబాలి’. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం 1854-1878 మధ్య కాలంలో బ్రిటీష్ ఇండియాలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ పీరియాడి్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. ఇందులో రణబాలి అనే వీరుడిగా విజయ్ నటిస్తుండగా.. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనున్నారు. సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11న వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. విజయ్, రష్మిక క్రేజీ కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో అభిమానులు కూడా ఈ డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే, గత కొద్దిరోజులుగా ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదని, వాయిదా పడే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ వాయిదా వార్తలకు బలం చేకూరుస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, గతంలో ఇచ్చిన పోస్టర్లలో సెప్టెంబర్ 11 రిలీజ్ డేట్‌ను స్పష్టంగా వేసిన మేకర్స్.. ఈ బర్త్‌డే పోస్టర్‌లో మాత్రం విడుదల తేదీని ఎక్కడా ప్రస్తావించలేదు. రిలీజ్ డేట్ మిస్ అవ్వడంతో సినిమా వాయిదా పడటం ఖాయమని, ఈ విషయాన్ని మేకర్స్ ఈ విధంగా హింట్ ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వార్తతో విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రౌడీ స్టార్ ఫ్యాన్స్‌కు నిరాశ.. కొత్త డేట్ ఎప్పుడో?

విజయ్-రష్మిక కాంబోపై భారీ అంచనాలు!

‘రణబాలి’ సినిమా వాయిదాపై అధికారిక ప్రకటన, కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలవాలని ఆశిస్తున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌ కోసం వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.