
📌 Key Points
- విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్థన’ గ్లింప్స్ విడుదల, భారీ యాక్షన్ తో ఆకట్టుకుంది.
- రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
- కీర్తి సురేష్, రాజశేఖర్, విజయ్ సేతుపతి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- 80వ దశకం తూర్పుగోదావరి నేపథ్యం, 2026 డిసెంబర్‌లో సినిమా విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘రౌడీ జనార్థన్’ గ్లింప్స్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రౌద్రరూపంలో కనిపించాడు. కీర్తి సురేష్, రాజశేఖర్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
గ్లింప్స్‌లో విజయ్ దేవరకొండ రౌద్రరూపం
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేసి, ప్రేక్షకులను అలరిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అలాంటి విజయ్ దేవరకొండ ఇప్పుడు మాస్, యాక్షన్ సినిమాతో వస్తున్నాడు. ఆ సినిమానే రౌడీ జనార్ధన. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది. ఈ మేరకు స్పెషల్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం, టైటిల్ గ్లింప్స్ వదిలింది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న రౌడీ జనార్ధన ( Rowdy Janardhana ) గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ లో కనిపించాడు. కత్తులు పట్టుకొని, శత్రువులను నరక్కుంటూ రక్తానికి మరిగిన రౌడీలా కనిపించాడు. ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే, వాడే రౌడీ జనార్ధన అంటూ విజయ్ దేవరకొండ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఇది ఇలా ఉండగా రౌడీ జనార్ధన సినిమాకు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్, విజయ్ సేతుపతి కనిపించనున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. 80వ దశకంలో తూర్పుగోదావరి నేపథ్యంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. కాగా 2026 సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
రౌడీ జనార్ధన చిత్ర బృందం, కీలక నటులు
80ల నేపథ్యం, భారీ రిలీజ్ ప్లాన్
‘రౌడీ జనార్థన్’ గ్లింప్స్ విజయ్ దేవరకొండ అభిమానులకు అదిరిపోయే ట్రీట్. పవర్‌ఫుల్ యాక్షన్, డైలాగ్స్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. 2026 డిసెంబర్‌లో రానున్న ఈ చిత్రం సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకోవడం ఖాయం.


