|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జన నాయగన్ పై విజయ్ సంచలన వ్యాఖ్యలు! రాజకీయ కుట్ర కోణంలో ఆరోపణలు!

Published: 02-04-2026, 11:35 AM
జన నాయగన్ పై విజయ్ సంచలన వ్యాఖ్యలు! రాజకీయ కుట్ర కోణంలో ఆరోపణలు!
  • విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం పొలిటికల్ డ్రామాగా విడుదల కావాల్సి ఉంది.
  • సినిమా విడుదల వాయిదా వెనుక రాజకీయ కుట్ర ఉందని విజయ్ ఆరోపించారు.
  • విజయ్ తన చివరి సినిమా తర్వాత రాజకీయాల్లో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నారు.
  • రాజకీయ పార్టీలు తన ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని విజయ్ అన్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన సినిమా ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడటంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా విడుదల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

జన నాయగన్ విడుదలపై విజయ్ ఆవేదన

Vijay Thalapathy: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ నెల చివరన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో విజయ్ టీవీకే పార్టీ తరఫున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఏకంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు తిరుచ్చిలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇలా నామినేషన్ వేయడం కోసం విజయ్ రావడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే వారిని ఉద్దేశించి ఈయన పలు వ్యాఖ్యలు చేశారు. జన నాయగన్ సినిమా గురించి విజయ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తమిళనాడులో తనని ఎదుర్కోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయని ఈయన తెలిపారు. కరూర్ తొక్కిసలాట ఘటన అలాగే తన చివరి సినిమా జననాయగన్ విడుదల కాకుండా ఆగిపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని తెలిపారు. ఇటీవల ఈ సినిమా కనుక విడుదలయితే ఖచ్చితంగా ప్రజలకు నాకు మధ్య ఉన్న సంబంధం మరింత బలపడుతుందని, అది ఎన్నికలకు నాకు మరింత అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతోనే కొంతమంది నా సినిమాపై కుట్రలు చేశారని ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు.

రాజకీయ కుట్ర కోణంలో విజయ్ ఆరోపణలు

ఇలా తనని తొక్కేయడం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని అయితే మీరందరూ పూర్తిస్థాయిలో మీ మద్దతు తనకు తెలపాలి అంటూ విజయ్ ఈ సందర్భంగా చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జననాయగన్ సినిమా కూడా పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9వ తేదీ విడుదల కావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికీ ఈ సినిమాకు సెన్సార్ పూర్తికాని నేపథ్యంలో విడుదలకు నోచుకోలేదని చెప్పాలి. ఇక ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

జననాయగన్ కు మోక్షం ఎప్పుడో?

సినిమాలకు స్వస్తి పలుకుతున్న విజయ్

ఈ సినిమాలో విజయ్ జోడిగా పూజా హెగ్డే నటించారు. విజయ్ కూతురి పాత్రలో మమత బైజు నటించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేకపోవడంతో అభిమానులు కూడా ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా విజయ్ ఆఖరి సినిమా కావటం విశేషం. విజయ్ రాజకీయాలలోకి వచ్చిన నేపథ్యంలో ఈయన పూర్తిగా సినిమాలకు స్వస్తి పలుకుతూ రాజకీయాలపైనే ఫోకస్ చేయబోతున్నారు. ఇలా విజయ్ ఆఖరి సినిమా కావడంతో అభిమానులలో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఎన్నికలు పూర్తి అయిన తరువాత నైనా ఈ సినిమా విడుదలకు మోక్షం వస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

విజయ్ తన చివరి సినిమాతో రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.