|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ‘జన నాయగన్’ కి బిగ్ షాక్! రూ.120 కోట్ల డీల్ రద్దు.. దెబ్బ మీద దెబ్బ!

Published: 12-03-2026, 9:35 AM
విజయ్ 'జన నాయగన్' కి బిగ్ షాక్! రూ.120 కోట్ల డీల్ రద్దు.. దెబ్బ మీద దెబ్బ!
  • విజయ్ ‘జన నాయగన్’ డిజిటల్ రైట్స్ రూ.120 కోట్ల డీల్ అమెజాన్ ప్రైమ్ తో రద్దు!
  • సెన్సార్ వివాదాల కారణంగా సినిమా విడుదల ఆలస్యం కావడంతో డీల్ రద్దు చేసుకున్న అమెజాన్.
  • సినిమాలో కొన్ని సన్నివేశాలు, డైలాగులపై సెన్సార్ బోర్డు అభ్యంతరం, కోర్టుకు వెళ్లిన మేకర్స్.
  • జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడుతూనే ఉంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి!

దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఓటీటీ డీల్ రద్దు కావడంతో షాక్ తగిలింది.

అమెజాన్ ప్రైమ్ షాకింగ్ నిర్ణయం!

Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్’. గత కొన్ని నెలలుగా ఈ సినిమా చుట్టూ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సెన్సార్ కారణాల వల్ల సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అయితే, తాజాగా ఈ సినిమాకు మరో షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సెన్సార్ సమస్యలే కారణమా?

జన నాయగన్(Jana Nayagan) సినిమా డిజిటల్ రైట్స్ ను సుమారు రూ. 120 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయాలనీ ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్ ప్రైమ్. కానీ, తాజా సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ ఈ భారీ డీల్ ను రద్దు చేసుకుందట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం. జన నాయగన్ విడుదలలో జాప్యంమేనట.

విడుదల ఎప్పుడో చెప్పలేని పరిస్థితి!

జన నాయగన్ సినిమా సెన్సార్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమాలో కొన్ని సీన్స్, డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని సూచించింది సెన్సార్. కానీ, ఈ విషయంలో కోర్టుకు వెళ్లారు మేకర్స్. ఇక అప్పటినుంచి జన నాయగన్ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేంతంగా ఉంది పరిస్థితి. అందుకే, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ డీల్ ను క్యాన్సిల్ చేసున్నట్టుగా తెలుస్తోంది. అయితే, నిర్మాణ సంస్థ నుండి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

‘జన నాయగన్’ సినిమా విడుదల విషయంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ డీల్ రద్దు మరింత నిరాశ కలిగించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.