
📌 Key Points
- విజయ్ ‘జననాయగన్’ సెన్సార్ స్క్రీనింగ్ వాయిదా పడింది, కారణం సెన్సార్ బోర్డు సభ్యులలో ఒకరికి అనారోగ్యం.
- సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఉండటంతో సెన్సార్ కట్స్ ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
- మార్చి 17న స్క్రీనింగ్ తర్వాత సినిమా విడుదల తేదీపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమా సెన్సార్ ప్రక్రియలో మరోసారి బ్రేక్ పడింది. సెన్సార్ బోర్డు సభ్యులలో ఒకరు అనారోగ్యం పాలవ్వడంతో స్క్రీనింగ్ వాయిదా వేశారు. దీనితో సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది.
సెన్సార్ సమస్యలతో వాయిదా
Jananayagan Censor: దళపతి విజయ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జననాయగన్’ సెన్సార్ ప్రక్రియలో మరోసారి జాప్యం జరిగింది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక సెన్సార్ స్క్రీనింగ్ ఈరోజే జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, సెన్సార్ బోర్డు సభ్యులలో ఒకరు హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో చిత్ర యూనిట్ మరియు అభిమానులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సినిమా గత ఏడాది విడుదల కావాల్సి ఉంది. విజయ్ చివరి సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కేవీఎన్ ప్రొడక్షన్ కంపెనీ. ఇప్పటికే పలు మార్లు ఈ సినిమా విడుదల అవుతుందని వార్తలు వచ్పినా మూవీ టీం నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు.
Read als0- Hamsa Nandini: నా జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నా.. 16 సైకిళ్ళ కీమో థెరపీపై నటి ఎమోషనల్!
విడుదల తేదీపై సందిగ్ధత
ఈ స్క్రీనింగ్‌ను ఇప్పుడు మార్చి 17వ తేదీకి రీషెడ్యూల్ చేశారు. గత కొంతకాలంగా ఈ సినిమా సెన్సార్ విషయంలో పలు వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. రివైజింగ్ కమిటీ సభ్యులు సినిమాను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది సర్టిఫికేట్‌ను జారీ చేయనున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో, సెన్సార్ బోర్డు సూచించే కట్స్ లేదా మార్పులు సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రస్తుతానికి మార్చి 17న జరిగే స్క్రీనింగ్ తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. మార్చి 17 తర్వాత విజయ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది.
Read also- Film industry: రోజుకు 15 కోట్ల రెమ్యూనరేషన్.. ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డు!
అభిమానుల నిరీక్షణ
ఈ వాయిదా కారణంగా సినిమా విడుదల తేదీలో కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కెరీర్‌లో ఇది చివరి సినిమా కావడంతో, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే చిత్ర బృందం అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది. ఈ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెన్సార్ మాత్రం ఈ సినిమా విడదులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వుడం లేదు. మరి మార్చి 17 తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతలు భరీ గా ఖర్చు పెట్టారు.
ప్రస్తుతానికి మార్చి 17న జరిగే స్క్రీనింగ్ తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ వస్తుందో లేదో వేచి చూడాలి. సినిమా విడుదల తేదీలో మార్పులు జరిగే అవకాశం ఉంది.


