|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ‘జననాయగన్’ పై సంచలన నిజాలు! అభిమానులకు షాకింగ్ న్యూస్!

Published: 31-01-2026, 3:35 AM
విజయ్ 'జననాయగన్' పై సంచలన నిజాలు! అభిమానులకు షాకింగ్ న్యూస్!
  • విజయ్ ‘జననాయగన్’ విడుదల వాయిదా.. అభిమానుల్లో నిరాశ!
  • రాజకీయాల కారణంగా సినిమా విడుదల ఆలస్యం అవుతోందని విజయ్ ఆవేదన!
  • భగవంత్ కేసరి రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘జననాయగన్’!
  • పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం!

తలపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదల వాయిదా పడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై విజయ్ ఎలా స్పందించారో చూడండి!

విజయ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్(Thalapathy Vijay) పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు. ఇక విజయ్ చివరి సినిమాగా ‘జన నాయగన్’(Jana Nayagan) రాబోతున్న విషయం తెలిసిందే. ఇది హెచ్ వినోత్(H Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్‌గా రాబోతున్నట్లు టాక్. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా జనవరి 9 సంక్రాంతి కానుకగా.. విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ అభ్యంతరాల కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఇక అప్పటినుంచి వివాదాలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. కానీ చిక్కుల నుంచి బయటపడటం లేదు.

ఇక ఈ సినిమాతో విజయ్‌ని చివరిసారిగా బిగ్ స్క్రీన్‌పై చూడాలనుకున్న అభిమానుల కోరిక నెరవేరకపోగా.. నిరాశ ఎదురవుతూ ఆందోళనను కలిగిస్తోంది. ఎన్ని వివాదాలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు సైలెంట్‌గా ఎదుర్కొన్న విజయం ఈ విషయాలపై స్పందించలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్, ‘జననాయగన్’వాయిదాపై ఎమోషనల్ అయ్యారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి పూర్తిగా రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని అనుకున్నాను. సినిమాలు చేసే అవకాశం లేదు కాబట్టి ఏం జరిగినాఎదుర్కోవడానికి సిద్ధమయ్యాను. నా రాజకీయాల వల్ల సినిమాలు ప్రభావితం కావచ్చని నేను ముందే ఊహించాను. అందుకే ముందుగానే మానసికంగా సిద్ధమయ్యాను. కానీ జన నాయగన్ విషయంలో మాత్రం మా నిర్మాతలను చూస్తే బాధగా ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

జననాయగన్ విడుదల వాయిదాకు కారణం ఇదేనా?

రాజకీయాల్లో విజయ్..సినిమా భవితవ్యం ఏమిటి?

విజయ్ ‘జననాయగన్’ విడుదలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయపరమైన కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యం కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.