|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్‌కి బిగ్ షాక్! ‘జన నాయగన్’ విడుదలకు సుప్రీంకోర్టు బ్రేక్!!

Published: 15-01-2026, 3:00 AM
విజయ్‌కి బిగ్ షాక్! 'జన నాయగన్' విడుదలకు సుప్రీంకోర్టు బ్రేక్!!
  • విజయ్ ‘జన నాయగన్’ సినిమాకు సుప్రీంకోర్టులో ఊహించని షాక్!
  • సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, విడుదలపై స్టే విధించిన కోర్టు.
  • మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశం!
  • సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాకు బ్రేక్.. అభిమానుల్లో నిరాశ.

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది చేదు వార్త! సినిమాకు సెన్సార్ సమస్యలు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

సుప్రీంకోర్టులోనూ విజయ్ జననాయగన్ సినిమాకు చుక్కెదురైంది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మంద్రాస్ హైకోర్టు ఉత్వర్వులను చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ నెల 20న విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ కు సుప్రీం ధర్మాసనం సూచించింది.

ఇదిలా ఉంటే జననాయగన్ సినిమా ఈ సంక్రాంతికి ముందే విడుదలకు సిద్ధం అవ్వగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో విడుదలకు బ్రేక్ పడింది. సినిమాలో రాజకీయ, సామాజిక, కులపరమైన కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఆడియోలను మ్యూట్ చేయాలని చిత్రయూనిట్ కు సెన్సార్ బోర్డు సూచించింది. దీంతో చిత్రయూనిట్ కోర్టును ఆశ్రయించగా అక్కడ సైతం అనుకూలంగా తీర్పు రాలేదు. తరవాత సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నాారు. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సెన్సార్ బోర్డు అభ్యంతరాలు!

విడుదలపై నీలినీడలు?

విజయ్ ‘జన నాయగన్’ సినిమా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ సినిమా విడుదల గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.