|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డిసెంబర్ 4న ప్రభాస్ ‘ఫౌజీ’ విడుదల! అభిమానులకు నిరీక్షణ తప్పదా?

Published: 06-04-2026, 10:05 AM
డిసెంబర్ 4న ప్రభాస్ 'ఫౌజీ' విడుదల! అభిమానులకు నిరీక్షణ తప్పదా?
  • ప్రభాస్ ఫౌజీ సినిమా ఆగష్టు నుండి డిసెంబర్ 4కి వాయిదా పడింది.
  • ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడిగా కనిపించనున్నారు.
  • ఇమాన్వి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం కానున్నారు.
  • 1940ల నాటి బ్రిటీష్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఈ సినిమా ఆగష్టులో విడుదల కావాల్సి ఉండగా, డిసెంబర్ 4న విడుదల కానుందని సమాచారం. దీనితో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఫౌజీ విడుదల తేదీ వాయిదా

Fauzi Film: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటించిన ది రాజా సాబ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ప్రభాస్ అభిమానులు తన తదుపరి చిత్రం ఫౌజీ(Fauzi) పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినపడుతూనే ఉన్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు 70% పూర్తి అయ్యిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అనుకున్న విధంగానే ఆగస్టు నెలలో ఈ సినిమా విడుదల కాబోతుందని అభిమానులు భావించారు కానీ, ఈ సినిమా మాత్రం ఆగస్టులో కాకుండా డిసెంబర్ 4వ తేదీ విడుదల కాబోతోంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాను డిసెంబర్ 4న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. మరికొద్ది నెలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని షూటింగ్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లకు కాస్త సమయం తీసుకుంటూ ఈ సినిమాని డిసెంబర్ 4న విడుదల చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

బ్రిటిష్ సైనికుడిగా ప్రభాస్

ఇలా అనుకున్న సమయంలో కాకుండా ఈ సినిమా మరింత ఆలస్యం కావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన ఫుటేజ్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని, హనురాగవపూడి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా కంటే పది రెట్లు అద్భుతంగా పౌజి సినిమా ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా నటి ఇమాన్వి(Imanvi) నటించబోతున్నారు. ఇది ఈమెకు డెబ్యూ ఫిలిం కావటం విశేషం.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా..

సినిమాపై అభిమానుల అంచనాలు

ఈ సినిమా 1940ల కాలం నాటి బ్రిటీష్ ఇండియా నేపథ్యంతో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా స్వాతంత్య్రానికి ముందు జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇలా ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అయితే తదుపరి ప్రభాస్ సందీప్ రెడ్డి సినిమా షూటింగ్ ఇబ్బందులలో పడుతుందని అభిమానులు భావిస్తున్నారు. సందీప్ రెడ్డి ఈ సినిమాని 2027 మార్చి 5 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా యధావిధిగా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే ఫౌజీ త్వరగా విడుదల అయితేనే స్పిరిట్ సినిమాకు ఇబ్బందులు ఉండవని అభిమానులు భావిస్తున్నారు.

ప్రభాస్ ఫౌజీ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. సినిమా విడుదల ఆలస్యం కావడంతో సందీప్ రెడ్డి సినిమా షూటింగ్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.