|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ‘జననాయగన్’కు బిగ్ షాక్! విడుదలకు బ్రేక్.. అభిమానులకు నిరాశ!

Published: 09-01-2026, 7:15 AM
విజయ్ 'జననాయగన్'కు బిగ్ షాక్! విడుదలకు బ్రేక్.. అభిమానులకు నిరాశ!
  • విజయ్ ‘జననాయగన్’ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే!
  • సినిమాలో మతపరమైన మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డు ఆరోపణ.
  • జనవరి 9న విడుదల కావాల్సిన సినిమాకు బ్రేక్.. అభిమానుల్లో నిరాశ!
  • రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇది విజయ్ చివరి సినిమా కావడం విశేషం.

తమిళ స్టార్ విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమాకు ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. సెన్సార్ సమస్యలతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దీనికి తోడు ఇప్పుడు డివిజన్ బెంచ్ స్టే విధించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

విజయ్ సినిమాకు సెన్సార్ చిక్కులు!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమాకు చిక్కులు వీడలేదు. జన నాయగన్ చిత్రయూనిట్‌కు డివిజన్ బెంచ్‌లో షాక్ తగిలింది. ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జననాయగన్ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా వ్యాప్తంగా విడుద‌ల కావాల్సివుంది. సినిమా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంద‌ని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ సినిమాకు సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో వాయిదా ప‌డింది.

సెన్సార్ ఇవ్వ‌క‌పోవడంతో సినిమా నిర్మాత‌లు కోర్టును ఆశ్ర‌యించ‌గా.. మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా స‌న్నివేశాలు ఉన్నాయ‌ని, సాయిధ ధ‌ళాల‌ను అభ్యంత‌క‌ర రీతిలో చూపించార‌ని సెన్సార్ బోర్డు ఆరోపించింది. నేడు కోర్టులో ఈ అంశంపై విచ‌ర‌ణ జ‌ర‌గ్గా డివిజ‌న్ బెంచ్ స్టే విధించింది. అయితే జ‌న‌నాయ‌గ‌న్ విజ‌య్ చివ‌రి సినిమా అన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజ‌య్ ఇదే త‌న చివ‌రి సినిమాగా ప్ర‌క‌టించారు. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. త‌మ స్టార్ ను చివ‌రిసారి తెర‌పై చూసుకోవాల‌ని అభిమానులు ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. కానీ మ‌రోసారి స్టే విధించ‌డంతో వారికి నిరాశ త‌ప్ప‌లేదు.

డివిజన్ బెంచ్ స్టే.. విడుదల వాయిదా?

చివరి సినిమాపై అభిమానుల ఆశలు!

విజయ్ చివరి సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.