|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పెళ్లికి పిలవలేదని అలిగిన బుజ్జి ఫ్యాన్.. దిగొచ్చిన రౌడీ, శ్రీవల్లి!

Published: 20-03-2026, 9:35 AM
షాకింగ్: పెళ్లికి పిలవలేదని అలిగిన బుజ్జి ఫ్యాన్.. దిగొచ్చిన రౌడీ, శ్రీవల్లి!
  • విజయ్ దేవరకొండ, రష్మిక దంపతుల గొప్ప మనసు చాటుకున్న మరో ఘటన!
  • పెళ్లికి పిలవలేదని చిన్నారి అభిమాని అలక.. వెంటనే స్పందించిన విరోష్!
  • చిన్నారిని ఇంటికి పిలిచి ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన స్టార్ కపుల్!
  • ప్రేమతో భోజనం తినిపించిన రష్మిక, విజయ్.. వైరల్ అవుతున్న వీడియోలు!

టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరు చేస్తున్న పనులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

అలిగిన అభిమాని.. చలించిన విరోష్ దంపతులు!

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్) తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట, కేవలం వేడుకలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అన్నదానాలు చేస్తూ, అభిమానులకు స్వీట్లు పంచుతూ వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో ఇటీవల తనను పెళ్లికి పిలవలేదని బుజ్జి అభిమాని అలిగిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం విరోష్ దృష్టికి రావడంతో చిన్నారి ఇంటికి పిలిచి నచ్చిన భోజనం పెడతామని మాట ఇచ్చారు. అయితే, ఇచ్చిన మాట ప్రకారం చిన్నారిని, తన కుటుంబాన్ని తాజాగా ఇంటికి పిలిచి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

ఇంటికి పిలిచి మరీ స్పెషల్ ట్రీట్ ఇచ్చిన జంట!

‘మేము కూడా విజయ్ దేవరకొండ, రష్మిక ఫ్యాన్స్ యే కదా.. నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు? అందరికీ లడ్డూలు ఇస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు.. మమ్మల్ని కూడా పిలిస్తే ఏమైతుందంటా?’ అంటూ ఓ చిన్నారి అత్యంత అమాయకంగా, క్యూట్‌గా చేసిన ఇన్‌స్టా రీల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తన అభిమాన హీరో పెళ్లికి తనను పిలవలేదన్న ఆ పాప అలక రౌడీ స్టార్ దృష్టికి వెళ్ళింది.

విజయ్, రష్మికల ప్రేమకు ఫిదా అవుతున్న నెటిజన్లు!

అభిమాని కోరికను గౌరవిస్తూ విజయ్ దేవరకొండ తక్షణమే స్పందించారు. ఆ చిన్నారిని, ఆమె కుటుంబాన్ని ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించారు. రష్మిక, విజయ్ కలిసి ఆ పాపతో సరదాగా గడపడమే కాకుండా, స్వయంగా దగ్గరుండి భోజనం తినిపించారు. ఈ వీడియోను ఆ చిన్నారి (urs_luckythalli ) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ విందు వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సాధించావ్ బుజ్జి తల్లి అంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేశారు. అభిమానుల పట్ల ఈ స్టార్ కపుల్ చూపిస్తున్న ప్రేమాభిమానాలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

చిన్నారి పట్ల విరోష్ చూపించిన ప్రేమకు అందరూ జేజేలు పలుకుతున్నారు. ఈ కపుల్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.