
📌 Key Points
- విజయ్, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగింది.
- హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లిన ఈ జంట ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- విజయ్ ‘రౌడీ జనార్దన్’, ‘రణబలి’ సినిమాలలో నటిస్తున్నారు.
- రష్మిక బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది, ‘కాక్‌టైల్ 2’ విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి హనీమూన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంట థాయిలాండ్‌లో హనీమూన్ జరుపుకుంటున్నట్లు సమాచారం.
ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం
Vijay Rashmika: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే వీరిద్దరూ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయ్ పూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఒకటైన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత వీళ్ళిద్దరికీ సంబంధించిన ఎన్నో రకాల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను వీరిద్దరూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో వీరిద్దరూ జంటగా పలు కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ రష్మికల హనీమూన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి తర్వాత ఈ జంట తమ హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లినట్టు తెలుస్తోంది. థాయిలాండ్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో భాగంగా పచ్చనీ ప్రకృతి నడుమ రష్మిక విజయ్ దేవరకొండను హగ్ చేసుకుని ఉన్న ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా విరోష్ తమ హనీమూన్ వెకేషన్ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే విజయ్ రష్మిక తిరిగి తమ సినిమాల పనులలో బిజీ కాబోతున్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్దన్ సినిమాతో పాటు రణబాలి అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక సైతం పలు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈమె నటించిన కాక్ టైల్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా విజయ్ రష్మిక ఇద్దరూ రణబాలి సినిమాలో జంటగా నటించబోతున్న సంగతి తెలిసిందే. పెళ్ళికి ముందు వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో జంటగా నటించారు. ఇక పెళ్లి తర్వాత మొదటిసారి విజయ్ రష్మిక రణబాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా వీరి అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా మారుతుందనే చెప్పాలి.
థాయిలాండ్‌లో హనీమూన్ జరుపుకున్న జంట
Post wedding thailand 😍😍 #VijayDeverakonda #RashmikaMandanna #Virosh #ViroshWedding pic.twitter.com/SrOF4si2Qg
— saikirankotha (@saikirankotha9) March 21, 2026
సినిమాలతో బిజీ కానున్న విజయ్, రష్మిక
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శర వేగంగా జరుపుకుంటుంది. పెళ్లి కోసం విజయ్ రష్మిక ఈ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక గ్లింప్ వీడియో, అలాగే విజయ్ రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక వీరిద్దరి పెళ్లి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏందయ్యా స్వామి అంటూ సాగిపోయే పాటను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే ఈసారి వీరిద్దరూ మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
మొత్తానికి విజయ్, రష్మికలు తమ హనీమూన్ వెకేషన్‌ను ఆనందంగా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ రణబలి సినిమాలో కలిసి నటించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

