
📌 Key Points
- విజయ్, రష్మికల పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయపూర్ కోటలో జరగనున్నట్లు సమాచారం.
- పెళ్లికి సంబంధించిన వీడియోలు, వెడ్డింగ్ కార్డు లీక్ కావడంతో విజయ్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది.
- గీతగోవిందం సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారిందని పుకార్లు ఉన్నాయి.
- ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగిందని, ఉంగరాలే సాక్ష్యమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీరి పెళ్లి కార్డు లీక్ కావడంతో విజయ్ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 26న ఉదయపూర్ కోటలో పెళ్లి జరగనుందని సమాచారం.
విజయ్, రష్మికల ప్రేమ ప్రయాణం
Vijay – Rashmika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వివాహానికి సిద్ధమవుతున్నా కూడా ఇంకా తమ బంధాన్ని బయట పెట్టకుండా రూమర్ద్ జంటగా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న (Rashmika mandanna) – విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘గీతగోవిందం’ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2019లో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో మరింత బలపడింది. ఇక అప్పటినుంచి డేటింగ్ లో ఉన్నారనే వార్తలు బయటకి వస్తూనే ఉన్నాయి. కానీ దీనిపై వీరు స్పందించలేదు. పైగా ఇద్దరు కలిసి వెకేషన్ కి వెళ్తారు.. కానీ విడివిడిగా ఆ ఫోటోలను షేర్ చేస్తారు. అయితే నెటిజన్స్ చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వీరు ఎక్కడ ఉన్నారో ఇట్టే పసిగట్టేసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా దీనికి తోడు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా అభిమానులతో అధికారికంగా ప్రస్తావించలేదు. ఇక వీరి చేతి వేళ్లకు ఉన్న డైమండ్ ఉంగరాలే వీరికి నిశ్చితార్థం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇక అప్పటినుంచి వీరిద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ లోని చారిత్రాత్మక కోటలో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య చాలా సింపుల్గా వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరూ జైపూర్లో తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి మరీ చూసుకుంటున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చినా వీరు మాత్రం స్పందించలేదు. దీనికి తోడు వీరి పెళ్లి పత్రిక కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇప్పటికీ దీనిపై స్పందించకుండా రహస్యంగానే అన్ని మెయిన్టైన్ చేస్తూ వస్తున్నారు.
వైరల్ అవుతున్న పెళ్లి వార్తలు
అయితే తాజాగా విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న వెడ్డింగ్ కార్డు లీక్ అవడంతో విజయ్ దేవరకొండ టీం కాస్త అసహనం వ్యక్తం చేసింది.సంయమనం పాటించాలని ఆమాత్రం తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..విజయ్ దేవరకొండ – రష్మిక వివాహం ఈనెల 26న జరగనుంది అంటూ సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డు వైరల్ అవ్వడంతో విజయ్ టీం స్పందిస్తూ..” పెళ్లి అనేది వ్యక్తిగత విషయం. అతిధుల వివరాలు, ఫోన్ నెంబర్లు ఉన్న కార్డుని పోస్ట్ చేయడం వల్ల ప్రముఖులకు ఇబ్బందులు ఎదురవుతాయి. రాజకీయ , సినీ రంగాలకు చెందిన అతిధుల భద్రతా దృష్ట్యా ఇటువంటి ప్రచారాలలో సమయనం పాటించాలి” అంటూ హితవు పలికింది..మొత్తానికైతే ఫిబ్రవరి 26న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగానే ఈ జంట ఉదయపూర్ లో ఒక్కటవుతున్నారని టీం చేసిన కామెంట్లతో క్లారిటీ వచ్చేసిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
టీమ్ అసహనానికి కారణం ఏమిటి?
ఇకపోతే మార్చి 4వ తేదీన హైదరాబాదు వేదికగా రిసెప్షన్ జరగనుంది అని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన విజయ్ దేవరకొండ.. అలాగే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ లతో కలిసి పనిచేసిన దర్శకులు , హీరోలు, హీరోయిన్లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం.
విజయ్, రష్మికల పెళ్లి వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఈ జంట ఒక్కటవ్వాలని కోరుకుంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


