|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, రష్మిక పెళ్లిలో షాకింగ్ ట్విస్ట్! పంది మాంసం వడ్డిస్తారా? వైరల్ అవుతున్న కొండవ సంప్రదాయం!

Published: 25-02-2026, 6:05 AM
విజయ్, రష్మిక పెళ్లిలో షాకింగ్ ట్విస్ట్! పంది మాంసం వడ్డిస్తారా? వైరల్ అవుతున్న కొండవ సంప్రదాయం!
  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహం!
  • రష్మిక సంప్రదాయం ప్రకారం పెళ్లిలో పంది మాంసం వడ్డించనున్నట్లు సమాచారం
  • తెలుగు, కొండవ సంప్రదాయాల్లో వివాహం జరగనుంది; వేడుకలు ప్రారంభం!
  • హైదరాబాద్ లో సినీ పరిశ్రమ స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు

టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్! వీరి పెళ్లికి సంబంధించిన ప్రతి అప్డేట్ వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుంది. పెళ్లిలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఏమిటో చూద్దాం!

విజయ్, రష్మిక పెళ్లి ఎక్కడ జరుగుతుంది?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందనా రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి.కానీ ఈ జంట మాత్రం బయటపడలేదు. కానీ.. రీసెంట్ గా.. తమ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. వీరి వివాహం ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్ లో జరగుతుంది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరుకానున్నారు. తర్వాత.. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితుల కోసం రిసెప్షన్ ఉంటుంది.

పెళ్లిలో పంది మాంసం వడ్డించడానికి కారణం ఏంటి?

హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. కాగా.. పెళ్లి మాత్రం రెండు సంప్రదాయాల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ వైపు నుంచి తెలుగు సంప్రదాయం ప్రకారం.. అదేవిధంగా.. రష్మిక కొండవ శైలిలో వివాహం జరుగుతుందని తెలుస్తోంది. వివాహానికి సంబంధించి పూజారులు కూడా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.

కొండవ సంప్రదాయం అంటే ఏమిటి?

అయితే.. వీరి పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దాని ప్రకారం… విజయ్-రష్మిక పెళ్లిలో పంది మాంసం అతిథులకు వడ్డించనున్నారట. నిజానికి.. మన తెలుగు సంప్రదాయంలో ఇలా పంది మాంసం వడ్డించం. కానీ.. రష్మికకు చెందిన కొండవ సంప్రదాయం ప్రకారం.. కచ్చితంగా పంది మాంసం వడ్డిస్తారట.ఇంట్లో పెంచుకున్న పందిని వడ్డిస్తారట. దీనితో పాటు కదంబుట్టు, వెదురు షూట్ కర్రీ వంటి వంటకాలు ఉంటాయని తెలుస్తోంది. అంతే కాదు ఈ సంప్రదాయం ప్రకారం..పురోహితులు పెళ్లి చేయరంట.కుటుంబంలోని పెద్దలు మాత్రమే చేస్తారని సమాచారం.

విజయ్, రష్మిక పెళ్లి గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.