
📌 Key Points
- విజయ్, రష్మికల నిశ్చితార్థం గత అక్టోబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.
- ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి.
- విజయ్, రష్మికల పెళ్లికి డచ్ గులాబీలను ప్రత్యేకంగా పంపించనున్నారు.
- ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ ఈ విషయాన్ని తెలియజేశారు.
టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి త్వరలో జరగనుందని తెలుస్తోంది. గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.
విజయ్, రష్మికల నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది?
Vijay Rashmika Marriage: టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ అయిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ జంట గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటూ వారి రిలేషన్ గురించి బయట పెట్టకుండా పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో వీరిద్దరూ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా నిశ్చితార్థపు(Engagment) వేడుకను జరుపుకున్నారు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరి పెళ్లి గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ ప్యాలెస్ లో చాలా ఘనంగా వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.
పెళ్లి గురించి నేరుగా రష్మికను నేరుగా ప్రశ్నించిన ఆమె మాత్రం సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు .కచ్చితంగా తన పెళ్లి గురించి అభిమానులకు చెప్పే చేసుకుంటానని చెబుతున్నారే తప్ప పెళ్లి తేదీని మాత్రం ప్రకటించలేదు. దీంతో వీరి పెళ్లి ఫిబ్రవరి 26వ తేదీ జరగబోతుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. పెళ్లికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే ఉదయపూర్ లో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయని సమాచారం. అలాగే ముంబైలో ప్రముఖ డిజైనర్ కలిసి పెళ్లి దుస్తులను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయించబోతున్నారని తెలుస్తోంది.
వివాహం ఉదయ్‌పూర్‌లో ఎప్పుడు జరగనుంది?
ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి డచ్ గులాబీలతో ప్రత్యేకంగా అలంకరించబోతున్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి కానుకగా ఈ డచ్ గులాబీలు రాబోతున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్మిక విజయ్ దేవరకొండ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వివాహ వేడుక కోసం తమ తరుపున అత్యంత నాణ్యమైన ‘ డచ్ గులాబీ’ (Dutch roses )లను పంపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇలా శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే వీరు పెళ్లి అతి త్వరలోనే జరగబోతుందని స్పష్టమవుతుంది.
రౌడీ జనార్దన్ గా విజయ్ దేవరకొండ..
డచ్ గులాబీల ప్రత్యేకత ఏమిటి?
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం వీరి వివాహం ఫిబ్రవరి 26ని జరగబోతున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ విషయం గురించి రష్మిక విజయ్ దేవరకొండ అధికారకంగా ప్రకటించనున్నారు. ఇక వీరి కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు మరోవైపు రష్మిక సైతం వరుస పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అభిమానులు వేచి చూస్తున్నారు.


