|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మికా విజయ్ పెళ్లి: ఆహ్వాన పత్రికతో పాటు ఊహించని బహుమతులు! వైరల్ వీడియో!

Published: 20-02-2026, 9:35 AM
రష్మికా విజయ్ పెళ్లి: ఆహ్వాన పత్రికతో పాటు ఊహించని బహుమతులు! వైరల్ వీడియో!
  • విజయ్, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న జరగనుంది.
  • కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది.
  • వెడ్డింగ్ ఇన్విటేషన్ తో పాటు ప్రత్యేక బహుమతులు అందజేశారు.
  • వీరి వివాహ ఆహ్వాన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోలో, ఆహ్వానంతో పాటు పలు బహుమతులు కూడా పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఫిబ్రవరి 26న విజయ్ రష్మిక వివాహం

Vijay Rashmika wedding: రష్మిక విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ వీరి రిలేషన్ ను బయటకు తెలియజేయకుండా రహస్యంగా ప్రేమాయణం సాగించారు .అయితే వీరిద్దరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చిన ఈ జంట స్పందించలేదు. అక్టోబర్ నెలలో వీరిద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇలా వీరి నిశ్చితార్థం గురించి కూడా ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు. ఇక ఈ జంట ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. వీరి వివాహం మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది.

ఇక వీరిద్దరూ తమ పెళ్లి వేడుకను కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది .అందుకే పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం. ఇక వెడ్డింగ్ రిసెప్షన్ కోసం పలువురు సెలబ్రిటీలో రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ వెడ్డింగ్ ఇన్విటేషన్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఈ జంట వెడ్డింగ్ ఇన్విటేషన్ తో పాటు పలు గిఫ్ట్స్ కూడా అందజేశారు.

వెడ్డింగ్ ఇన్విటేషన్ తో పాటు గిఫ్ట్స్

వెడ్డింగ్ ఇన్విటేషన్ బాక్స్ లో ఈ జంట పెళ్లికి సంబంధించిన కార్డుతో పాటు  నేషనల్ క్రష్ పర్ఫ్యూమ్, రౌడీ బ్రాండ్ కు సంబంధించిన టీషర్ట్, స్వీట్స్ తో పాటు నట్స్ తో ఏర్పాటుచేసిన వెడ్డింగ్ బాక్స్ అతిథులకు అందజేశారు. విలువైన కానుకలతో పాటు వీరి పెళ్లి ఆహ్వానం అందజేశారని చెప్పాలి. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ వీడియో బాక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ రష్మిక హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు వివిధ వ్యాపారాలను కూడా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ రౌడీ బాయ్స్ పేరుతో బిజినెస్ ప్రారంభించారు. ఇక రష్మిక సైతం ఇటీవల డియర్ డైరీ అని పెర్ఫ్యూమ్ బ్రాండ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వీరిద్దరూ కెరియర్ పరంగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు బిజినెస్ లో కూడా మంచి సక్సెస్ సాగించారు. విజయ్ దేవరకొండ రష్మిక మొదటి సారి గీతగోవిందం సినిమాలో కలిసిన నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా మరోసారి జతకట్టారు. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, నేడు ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వీరి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక జంటకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

విజయ్, రష్మికల పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.