
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఫిబ్రవరి 26న జరగనున్నట్లు సమాచారం.
- వీరిద్దరూ 2018లో ‘గీతాగోవిందం’ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు.
- విజయ్, రష్మిక ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ లుగా కొనసాగుతున్నారు.
- రష్మిక ఒక్కో సినిమాకు 6 నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వారి ప్రేమ వ్యవహారాలు, ఆస్తుల గురించి సమాచారం కోసం చదవండి.
విజయ్, రష్మికల పెళ్లి నిజమెంత?
Vijay – Rashmika:ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యంత సస్పెన్స్ తో కొనసాగుతున్న పెళ్లి ఏదైనా ఉంది అంటే అది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika mandanna) పెళ్లి అనే చెప్పాలి. 2018లో వచ్చిన ‘గీతాగోవిందం’ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత డేటింగ్ చేసుకున్నారు. అప్పటి నుంచి చట్టా పట్టాలేసుకొని వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఎక్కడ బయట పెట్టలేదు. పైగా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. అది కూడా అభిమానులతో పంచుకోలేదు. ఇప్పుడు ఎట్టకేలకు మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 26న ఉదయపూర్ లోని చారిత్రక కోటలో వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.. కానీ ఇప్పటికీ ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడకపోవడం అభిమానులను ఆందోళన కలిగించే అంశం అనే చెప్పాలి.
అలా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహం పై అటు జాతీయ మీడియాతో పాటు ఇటు లోకల్ మీడియా కూడా దృష్టి పెట్టింది. అత్యంత గోప్యంగా సాగుతున్న పెళ్లి వ్యవహారాలు, కార్యకలాపాలపై కూపీ లాగేందుకు మీడియా కూడా తంటాలుపడుతున్నా.. వీరు మాత్రం పెదవి విప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇకపోతే అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక మందన్న ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్ లుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి సంపాదన కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. మరి ఎవరి సంపాదన ఎక్కువ అనే డిబేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న వేళ.. మరో మూడు రోజుల్లో పెళ్లి జరగబోతోంది కాబట్టి ఎవరి సంపాదన ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..
వారి ఆస్తుల వివరాలు
రష్మిక మందన్న ఒకవైపు నేషనల్ క్రష్ గా పేరు దక్కించుకొని తన అద్భుతమైన నటనతో పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే బాక్సాఫీస్ వద్ద 3వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి ఈమె 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి , అంజనీపుత్ర చిత్రంతో మంచి గుర్తింపు అందుకుంది. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. గీతాగోవిందం సినిమాతో అభిమానుల మనసు దోచుకుంది. పుష్ప2, ఛావా, యానిమల్, కుబేర, సికందర్ ఇలా చెప్పుకుంటూ పోతే అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోను సంచలనం సృష్టిస్తున్న ఈమె ఒక్కో సినిమాకి బడ్జెట్ ను బట్టి 6 నుంచి 8 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
బ్రాండ్ ఎండార్స్మెంట్, సోషల్ మీడియా ప్రమోషన్స్ , ప్రైవేట్ కార్యక్రమాల ద్వారా సుమారుగా రూ.60 నుండి 80 కోట్ల మేరా ఈమె ఆస్తులు కూడబెట్టిందని సమాచారం. ఇకపోతే ముంబై , బెంగళూరు, కూర్గ్, హైదరాబాద్, గోవా వంటి ఖరీదైన నగరాలలో లగ్జరీ బంగ్లాలు ఉన్నాయి. బెంగళూరులో ఉండే బంగ్లా విలువ రూ.8 కోట్లు. ఇక ఈమె దగ్గర ఉన్న కార్ల విషయానికొస్తే.. ఆడి క్యూ 3, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ , టయోటా, ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి
పాన్ ఇండియా స్టార్స్ సంపాదన
ఇక రౌడీ హీరో ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. ఆయన నికర విలువ 70 – 90 కోట్లు ఉంటుందని సమాచారం జూబ్లీహిల్స్ లో 15 కోట్ల విలువ చేసే ఇల్లు.. రౌడీ వేర్ బ్రాండ్ కూడా ఆయన సొంతం. ఒక్కో సినిమాకి రూ.20 నుండి రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దగ్గర ఉండే కార్ల విషయానికి వస్తే ఓల్వో ఎక్స్ సి 90, ఫోర్డ్ మస్టాంగ్ , రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్లు ఉన్నాయి.
మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వార్త ఇంకా సస్పెన్స్ గానే ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. వారి ఆస్తుల గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి.


