|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, రష్మిక పెళ్లిలో షాకింగ్ రూల్స్! ఫోన్లు బ్యాన్, అతిథులకు నో ఎంట్రీ!

Published: 17-02-2026, 8:05 AM
విజయ్, రష్మిక పెళ్లిలో షాకింగ్ రూల్స్! ఫోన్లు బ్యాన్, అతిథులకు నో ఎంట్రీ!
  • ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో విజయ్, రష్మికల వివాహం.
  • పెళ్లికి ఫోన్లు అనుమతించబడవు.
  • మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక.
  • సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు రిసెప్షన్‌కు ఆహ్వానం.

టాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పీటలెక్కబోతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

విజయ్, రష్మికల పెళ్లి ఫిక్స్!

Vijay Rashmika wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావిడి మొదలైంది. కొత్త ఏడాది మొదలవడంతో ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీ విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఉదయపూర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇక రష్మిక విజయ్ దేవరకొండ సైతం తమ సినిమాలో షూటింగ్ పనులకు చిన్న విరామం ప్రకటించి పెళ్లి పనులలో బిజీ అయ్యారు. ఇప్పటికే వీరిద్దరూ ముంబైలో పెళ్లి పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక విజయ్ దేవరకొండ రష్మిక తమ పెళ్ళికి సంబంధించిన విషయాన్ని అధికారకంగా ప్రకటించకపోయిన పెళ్లి పనులు మాత్రం జరుగుతున్న ఇప్పటికే ఎంతోమందికి పెళ్లి ఆహ్వాన పత్రికలు కూడా అందాయని తెలుస్తుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే విజయ్ దేవరకొండ రష్మిక తమ పెళ్లిని కేవలం ఒక ప్రైవేట్ ఈవెంట్ లాగా చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది .ఈ నేపథ్యంలోనే పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరగబోతుంది.

పెళ్లిలో ఫోన్లకు నో ఎంట్రీ!

ఉదయపూర్ లో జరగబోయే ఈ పెళ్లి వేడుకకు పెద్దగా సెలబ్రిటీలు కూడా ఎవరు హాజరు కావడం లేదని చాలా సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారని సమాచారం. రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లికి సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. వీరి పెళ్లిలో పలు కండిషన్లను పెట్టినట్లు సమాచారం. పెళ్లికి వెళ్లే అతిథులు లేదా కుటుంబ సభ్యులు వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు షూట్ చేసి బయటకు లీక్ చేయడానికి వీలు లేకుండా పెళ్లిలో మొబైల్ ఫోన్స్ కు అనుమతి ఇవ్వలేదట. నో ఫోన్ పాలసీ పద్ధతిలో వీరి పెళ్లి వేడుక జరగబోతుందని తెలుస్తోంది.

ఇక విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారు అదేవిధంగా మార్చి నాలుగో తేదీ హైదరాబాద్ లో వీరి పెళ్లి రిసెప్షన్ జరగబోతుందని, ఈ రిసెప్షన్ వేడుకలో భాగంగా పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు అత్యంత సన్నిహితులు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇటీవల విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. తన పెళ్లికి ఆహ్వానించడం కోసమే విజయ్ దేవరకొండ కలిసారంటూ కూడా వార్తలు వచ్చాయి. మరి వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న ఈ జంట మాత్రం అధికారికంగా స్పందించలేదు అసలు పెళ్లికి సంబంధించిన విషయాన్ని వీరు తెలియజేస్తారా లేదంటే గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

రిసెప్షన్ ఎక్కడ, ఎప్పుడు?

విజయ్, రష్మికల పెళ్లి వేడుక ప్రైవేట్‌గా జరగనుంది. ఫోన్లు అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మార్చి 4న రిసెప్షన్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.