
📌 Key Points
- విజయ్, సంగీత విడాకుల వ్యవహారం కోర్టుకు చేరకుండా పరిష్కరించేందుకు యత్నాలు!
- సంగీతకు రూ. 250 కోట్ల భారీ భరణం ఆఫర్ చేసిన విజయ్ – సంచలన ప్రకటన!
- భార్య, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం
- రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్న విజయ్!
విజయ్, సంగీతల విడాకుల వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు వీరిద్దరూ ఎందుకు విడిపోతున్నారు? రూ. 250 కోట్ల ఆఫర్ వెనుక అసలు నిజం ఏంటి? తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి.
విడాకుల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న హీరో విజయ్ (hero Vijay)కి తన భార్య ఉహించని షాక్ ఇచ్చింది. తన భర్త విజయ్ తనను హింసిస్తున్నాడని, ఓ నటితో సంబంధం పెట్టుకున్నారని, తనకు విడాకులు ఇప్పించాలని సంగీత (Sangeeta) చెంగల్‌పట్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ పరిణామం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, విజయ్ ఈ వివాదాన్ని కోర్టు పరిధిలోకి తీసుకెళ్లకుండా, సామరస్యంగా పరిష్కరించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆయన తన భార్య సంగీతకు దాదాపు రూ. 250 కోట్ల భారీ భరణాన్ని (Alimony) ఆఫర్ చేశారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తన భార్యతో పాటు ఇద్దరు పిల్లల (జాసన్ సంజయ్, దివ్య సాషా) భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రూ. 250 కోట్ల ఆఫర్ నిజమెంత?
విజయ్ ప్రస్తుతం తన రాజకీయ ప్రయాణం (TVK పార్టీ)లో కీలక దశలో ఉండటంతో, వ్యక్తిగత విషయాలు బహిరంగమై తన ఇమేజ్‌పై ప్రభావం పడకూడదని భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని, రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో చర్చలు జరిపి వివాదానికి ముగింపు పలకాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. సంగీత ఈ ఆఫర్‌కు అంగీకరిస్తే, ఆమె గతంలో వేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయమా?
అయితే, ఈ విషయంలో విజయ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వివాదం ఇంతటితో ముగిసినట్లేనా అంటే.. అది సంగీత తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇద్దరి మధ్య ఆర్థిక, ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరితే, ఈ వివాదం కోర్టు బయటే ముగిసిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. లేదంటే చట్టపరమైన ప్రక్రియ కొనసాగవచ్చని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి.. ఈ ₹250 కోట్ల ఆఫర్ వార్త తమిళ రాజకీయ, సినిమా రంగాల్లో సంచలనంగా మారింది.
విజయ్, సంగీతల విడాకుల వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.


