|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: 26 ఏళ్ల తర్వాత విజయ్, సంగీత విడాకులు! ‘శుభాకాంక్షలు’ సినిమాతో పెళ్లికి లింక్ ఇదే!

Published: 27-02-2026, 10:36 AM
షాకింగ్: 26 ఏళ్ల తర్వాత విజయ్, సంగీత విడాకులు! 'శుభాకాంక్షలు' సినిమాతో పెళ్లికి లింక్ ఇదే!
  • విజయ్, సంగీత ప్రేమ వివాహం: 1999 ఆగస్టు 25న ఒక్కటైన మనసులు!
  • 1996లో ‘పూవే ఉనక్కగ’ సినిమాతో మొదలైన పరిచయం, ప్రేమగా మారిన వైనం!
  • 26 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు: విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగీత!
  • రాజకీయ భవిష్యత్తుపై విడాకుల ప్రభావం? టీవీకే పార్టీలో విజయ్ పరిస్థితి ఏమిటో చూడాలి!

తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితంలో పెను విషాదం! ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అసలు ఏం జరిగింది? ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

విజయ్-సంగీత: ప్రేమ వివాహం వెనుక అసలు కథ!

Vijay- Sangeetha: తమిళనాట ఎన్నికల వేళ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ కి షాక్ తగిలింది. ఆయన భార్య సంగీతం ఆయన నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దేనికి సంబందించిన విచారణ మార్చిలో జరుగనున్నట్టు తెలుస్తోంది. అయితే, త్వరలో జరుగనున్న తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ నుంచి బరిలో దిగనున్నాడు విజయ్. ఈనేపథ్యంలో విడాకుల వ్యవహారం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే, విజయ్- సంగీత విడాకుల న్యూస్ వైరల్ అవుతున్న వేళ ఈ ఇద్దరు పెళ్లి గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటంటే, విజయ్- సంగీతది ప్రేమ పెళ్లి. అసలు వీళ్ళ మనసులు ఎలా కలిశాయి అంటే.. సంగీత స్వర్ణలింగమ్ శ్రీలంకన్ తమిళ్. ఆమె యూకేలో చదువుకుంది. ఆమె విజయ్ కి పెద్ద ఫ్యాన్. ఈ ఇద్దరి మొదటి కలయిక ఎలా జరిగింది అంటే.

విడాకుల బాటలో ఈ జంట.. కారణమేంటి?

అది, 1996 విజయ్ నటించిన పూవే ఉనక్కగ(తెలుగులో శుభాకాంక్షలు) సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సమయంలో విజయ్ ని కలిసేందుకు లండన్ నుంచి వచ్చింది సంగీత(Vijay- Sangeetha). అలా వారిమధ్య పరిచయం ఏర్పడింది. ఒకరి వ్యక్తిత్వాలు ఒకరికి బాగా నచ్చడంతో కొద్దిరోజులకే మాటలు, మనసులు కలిశాయి. ఇక సంగీత నచ్చడంతో విజయ్ పేరెంట్స్ సంగీత పేరెంట్స్ ని అడిగి వాళ్ళ ఒప్పందంతో పెళ్లి సెట్ చేశారు. అలా పరిచయం ఏర్పడిన దాదాపు మూడేళ్ళ తరువాత అంటే 1999 ఆగస్టు 25న వీరి పెళ్లి జరిగింది.

రాజకీయ భవిష్యత్తుపై విడాకుల ప్రభావం ఉంటుందా?

వీరికి కొడుకు జాసన్ సంజయ్, కూతురు దివ్య సాషా ఉన్నారు. అయితే, 26 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తరువాత ఇప్పుడు విజయ్ భార్య విడాకుల కోసం అప్లై చేయడం అనేది సంచలనంగా మారింది.

విజయ్, సంగీత విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఇది టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.