
📌 Key Points
- విక్రమ్ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ చేయడానికి భయపడిన విజయ్ సేతుపతి.
- దర్శకుడు లోకేష్ ప్రోత్సాహంతోనే ఆ సీన్లో నటించానని తెలిపిన విజయ్.
- లావుగా ఉండటం వల్ల ట్రోల్స్ వస్తాయని భయపడిన విజయ్ సేతుపతి.
- విజయ్ సేతుపతి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ సేతుపతి విక్రమ్ సినిమాలోని తన ఇంట్రడక్షన్ సీన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను లావుగా ఉండటం వల్ల ఆ సీన్ చేయడానికి భయపడ్డానని, లోకేష్ కనగరాజ్ తనను ప్రోత్సహించారని తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
విజయ్ సేతుపతి భయం వెనుక అసలు కథ
Vijay Sethupathi: విజయ్ సేతుపతి (Vijay Sethupathi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పేరుకే కోలీవుడ్ నటుడు అయినప్పటికీ తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. విభిన్నమైన కంటెంట్ ను ఎంచుకుంటూ ఆడియన్స్ లో తనకంటూ ఒక మంచి పేరు దక్కించుకున్న ఈయన.. 2019లో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టారు. 2021 లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాలో విలన్ పాత్ర చేసి విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో గుర్తింపు లేని పాత్రలు చేసిన విజయ్ సేతుపతి.. ఆ తర్వాత తన నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ నేడు విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ , మలయాళం అంటూ భాషతో సంబంధం లేకుండా నేడు పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారు విజయసేతుపతి.
ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు విలన్ గా దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విక్రమ్ సినిమాలో తన ఇంట్రడక్షన్ సీన్ గురించి ఒక ఈవెంట్లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.. ముఖ్యంగా ఆ ఇంట్రడక్షన్ సీన్ చేసేటప్పుడు భయపడ్డానని , కానీ లోకేష్ ఇచ్చిన ధైర్యం వల్లే తాను ఆ సీన్లో చేశానని , లోకేష్ తన ఎలివేషన్ తో నా పాత్ర గుర్తిండిపోయేలా చేశారు అని ఆయన కామెంట్లు చేశారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
లోకేష్ కాన్ఫిడెన్స్ ఇచ్చిన ధైర్యం
విజయ్ సేతుపతి మాట్లాడుతూ..” విక్రమ్ సినిమాలో నా ఇంట్రడక్షన్ సీన్ తీస్తున్నప్పుడు.. నేను లోకేష్ కనగరాజుకి చెప్పాను. నేను చాలా లావుగా పొట్టతో ఉన్నాను. షర్టు లేకుండా చేస్తే ఆ తర్వాత ఆడియన్స్ నన్ను ట్రోల్ చేస్తారు అని.. అయితే లోకేష్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సేమ్ విక్రమ్ వేద సినిమాలో కూడా అంతే.. అటు విజయ్, అజిత్ రేంజ్ లో నాకు ఇంట్రడక్షన్ సీన్ ఇచ్చారు. ఇక ఆ పాత్రలు నన్ను ఊహించని స్థాయికి తీసుకెళ్లాయి” అంటూ విజయ్ సేతుపతి కామెంట్ చేశారు. మొత్తానికైతే ఒక పాత్ర వల్ల తాను భయపడినా.. డైరెక్టర్ ఇచ్చిన ఎలివేషన్ వల్ల తన పాత్ర గుర్తుండిపోయిందని.. అటు ఆడియన్స్ కూడా ఆ పాత్రను బాగా ఆదరించారు అని విజయ్ సేతుపతి తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్
విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇక మరికొన్ని చిత్రాలు లైన్లో ఉన్నట్లు సమాచారం.
మొత్తానికి విజయ్ సేతుపతి తన ఇంట్రడక్షన్ సీన్ గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఆ సీన్ చేయగలిగానని ఆయన అన్నారు. ప్రేక్షకులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.


