|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్ – షూటింగ్ మొద‌ల‌య్యేది అప్పుడే!

Published: 28-05-2025, 3:19 AM
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్ - షూటింగ్ మొద‌ల‌య్యేది అప్పుడే!

కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మరియు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. జూన్ చివరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Key Points

1

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో పాన్ ఇండియన్ సినిమా

2

జూన్ చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

4

బెగ్గర్ అనే టైటిల్‌తో ఐదు భాషల్లో విడుదల

షూటింగ్ ప్రారంభ తేదీ

కోలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి, టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ రాబోతోంది. డిఫ‌రెంట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ట‌బుతో పాటు క‌న్న‌డ న‌టుడు విజ‌య్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి మేక‌ర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ను రివీల్ చేశారు. జూన్ నెలాఖ‌రు నుంచి ఈ పాన్ ఇండియ‌న్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం షూటింగ్ లొకేష‌న్స్ కోసం యూనిట్ హైద‌రాబాద్‌తో పాటు చెన్నైలో రెక్కీ నిర్వ‌హిస్తోన్నారు. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో విజ‌య్ సేతుప‌తి, ట‌బుతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం మొత్తం పాల్గొంటార‌ని పేర్కొన్నారు.

తారాగణం మరియు సినిమా వివరాలు

ఈ మూవీకి బెగ్గ‌ర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐదు భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అన్ని భాష‌ల‌కు యాప్ట్ అయ్యేలా ఈ టైటిల్‌ను నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా నెవ‌ర్ బిఫోర్ క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌ల్టీపుల్ వేరియేష‌న్స్‌తో విజ‌య్ సేతుప‌తి పాత్ర సాగుతుంద‌ని అంటున్నారు.

ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూనే ఛార్మితో క‌లిసి పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంతో పాటు హిందీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

పూరి జగన్నాథ్ గత సినిమాల ప్రభావం

విజ‌య్ సేతుప‌తి మూవీ కంటే ముందు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లైగ‌ర్, డ‌బుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్ట‌ర్‌గా నిలిచాయి.పెట్టిన బ‌డ్జెట్‌లో స‌గం కూడా రివ‌క‌రీ సాధించ‌లేక‌పోయాయి. ఈ ఫ్లాప్‌ల ఎఫెక్ట్ గ‌ట్టిగానే పూరిపై ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

లైగ‌ర్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో జ‌న‌గ‌న‌మ‌ణ సినిమా చేయ‌బోతున్న‌ట్లు పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌క‌టించాడు. అనౌన్స్‌మెంట్‌తోనే ఆ సినిమా ఆగిపోయింది. తెలుగు హీరోలు ఎవ‌రూ పూరి జ‌గ‌న్నాథ్‌తో సినిమా చేయ‌డానికి ముందుకు రాక‌పోవ‌డంతో విజ‌య్ సేతుప‌తితో సినిమా చేస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

విజయ్ సేతుపతి-పూరి జగన్నాథ్ కాంబో సినిమాపై అంచనాలు పెరిగాయి. జూన్ చివరి నుంచి షూటింగ్ మొదలవుతుండటంతో సినిమా విడుదలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.