|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి కొడుకు.. ఇది గొప్ప ఆరంభం అంటున్న స్టార్ హీరో

Published: 03-11-2025, 12:00 PM
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి కొడుకు.. ఇది గొప్ప ఆరంభం అంటున్న స్టార్ హీరో

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ‘ఫీనిక్స్’ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే తమిళ్‌లో విజయవంతమైన ఈ చిత్రం నవంబర్ 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా సూర్యకి గొప్ప ఆరంభం అని విజయ్ సేతుపతి అన్నారు.

Key Points

1

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి 'ఫీనిక్స్' చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు.

2

స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో విజయవంతమైంది.

4

తన చిన్ననాటి యాక్షన్ హీరో కల 'ఫీనిక్స్' ద్వారా నెరవేరిందని విజయ్ సేతుపతి ఆనందం వ్యక్తం చేశారు.

సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. సూర్య సేతుపతి హీరోగా వస్తున్న మొదటి చిత్రం ‘ఫీనిక్స్’. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజలక్ష్మి ‘అన్ల్’ అరసు నిర్మించారు. ఇప్పటికే తమిళ్‌లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ఇప్పుడు తెలుగులో నవంబర్ 7 రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. ఈ సందర్భం మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘నేను జవాన్ సినిమా చేస్తున్నప్పుడు అనల్ అరసు మాస్టర్‌ను కలిసాను. అప్పుడు ఈ కథ చెప్పారు. మా అబ్బాయి ఇందులో నటించాలని అన్నారు. మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పాను. ఆ తర్వాత నాకు ఏమీ తెలియదు. వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. సినిమా చేశారు. నేను సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. ఇది మా అబ్బాయికి చాలా మంచి ఆరంభం. ఒక తండ్రిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. తనకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమా చేయాలని ఉండేది. తనకి యాక్షన్ చాలా ఇష్టం. నన్ను యాక్షన్ సినిమాలు చేయమని చెప్తుండేవాడు. తనకి మాస్ యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. యాక్షన్ సినిమాని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాంటి సినిమాలు చేయడం తన కల. ఒకరోజు తను యాక్టర్ కావాలి అని చెప్పాడు. అలా చెప్పిన ఏడాదిలోనే సినిమా చేశాడు. అదంతా డైరెక్టర్ అనల్ అరసు మాస్టర్, నిర్మాత రాజ్యలక్ష్మి మేడం గారి వలన సాధ్యపడింది. సినిమా ఏ భాషలో ఉన్న అందులో ఎమోషన్ కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరూ సినిమాని సెలబ్రేట్ చేస్తారు. అందుకే మనం అన్ని భాషలు సినిమాలు చూస్తాం. ఫినిక్స్ విషయంలో కూడా అది జరుగుతుంది. ఇందులో యాక్షన్ ఎమోషన్ అన్ని చాలా అద్భుతంగా కుదిరాయి. తప్పకుండా ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. నవంబర్ 7న థియేటర్‌లో రిలీజ్ కాబోతున్నది అందరూ సపోర్ట్ చేయండి’ అని తెలిపారు.

‘ఫీనిక్స్’పై విజయ్ సేతుపతి వ్యాఖ్యలు

సినిమా విడుదల, ఇతర వివరాలు

యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ‘ఫీనిక్స్’ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని విజయ్ సేతుపతి ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.