|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ దళపతి బిగ్ షాక్! త్రిషకు హ్యాండ్, సీన్ లోకి మాస్ హీరో ఎంట్రీ!

Published: 05-06-2026, 6:00 AM
విజయ్ దళపతి బిగ్ షాక్! త్రిషకు హ్యాండ్, సీన్ లోకి మాస్ హీరో ఎంట్రీ!
  • సీఎం విజయ్ దళపతి కీలక నిర్ణయం, త్రిషకు రాజకీయ హ్యాండ్!
  • తిరుచిరాపల్లి సీటులో త్రిషకు బదులు మరో స్టార్ హీరో ఎంట్రీ.
  • విజయ్-త్రిష బంధంపై తమిళనాట తీవ్ర చర్చ, సంచలన వార్తలు.
  • దళపతి కొత్త పార్టీ, రాజకీయ ఎత్తుగడలు, సంచలన పరిణామాలు!

తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి! స్టార్ హీరో విజయ్ దళపతి సీఎం అవ్వడంతో పాటు, ఆయన వ్యక్తిగత జీవితంపై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా త్రిషతో ఆయన బంధంపై జరుగుతున్న చర్చ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. తాజా పరిణామం సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది!

విజయ్ – త్రిష బంధంపై కొత్త ట్విస్ట్!

తమిళనాట సినిమా – రాజకీయం రెండు తేడా లేకుండా రసవత్తరంగా సాగుతోంది. స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉండగా విజయ దళపతి సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఏం సాధిస్తాడు లే అనుకుంటే ఏకంగా మొదటి ఎలక్షన్స్ కే సీఎం అయ్యి కూర్చున్నాడు. తమిళనాట పురాతన పార్టీలకు షాక్ ఇస్తూ.. కొత్తగా వచ్చిన టీవీకే అధికారం చేజిక్కించుకుంది. అయితే విజయ దళపతి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్ధులకు విమర్శనాస్త్రంగా మారింది హీరోయిన్ త్రిష. ఇద్దరు కలిసి సినిమాల్లో నటిస్తున్న టైమ్ నుంచే వీరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఆతరువాత త్రిష, విజయ్ ఇద్దరు దాదాపు 20 ఏళ్లు కలిసి సినిమాలు చేయలేదు. రీసెంట్ గా లియో సినిమాతో మళ్ళీ వీరిపై పుకార్లు మొదలయ్యాయి. ఎన్నికల టైమ్ లో త్రిష, విజయ్ పై రకరకాల వార్తలు ప్రచారం చేశారు కూడా. విజయ్ భార్య సంగీతం కూడా ఈ కారణంగానే విడాకులు కోరుతు కోర్టు మెట్లు ఎక్కినట్టు సమాచారం. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజయ్ -త్రిషల బంధం జనాల్లోకి నెగెటీవ్ గా తీసుకెళ్లలేక పోయారు. జనాలు ఈ విషయాన్ని నమ్మారా లేదా తెలియదు కానీ.. విజయ్ కు మాత్రం అఖండ విజయాన్ని అందించారు.

తిరుచిరాపల్లిలో త్రిషకు షాక్!

ఎలక్షన్ రిజల్ట్ రోజే త్రిష బర్త్ డే కావడం, ఆమె తిరుపతి వెళ్లి దర్శనం చేసుకోవడం, విజయ్ దళపతి సీఎం గా ప్రమాణ స్వీకారం రోజు త్రిష సందడి చేయడం, ఆతరువాత కూడా విజయ్ కారులో త్రిష కలిసి తిరగడం.. వీరిపై మరిన్ని అనుమానాలు కలిగేలా చేసింది. భర్య సంగీతతో బంధం ముగిసిపోవడంతో… త్రిషను విజయ్ పెళ్లి చేసుకుంటాడంటూ ప్రచారం జోరుగా సాగింది. త్రిష మరో జయలలిత కాబోతుందంటూ కామెంట్లు చేశారు. అంతే కాదు విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలిచారు. ఒక దానికి రాజీనామా చేయాల్సి ఉండగా.. ఆయన తిరుచిరాపల్లి నుంచి రాజీనామా చేయబోతున్నారు. ఈ స్థానం నుంచి త్రిషపోటీ చేస్తుందని.. గెలిచిన తరువాత ఆమెను డిప్యూటీ సీఎం ను చేయబోతున్నారంటూ మరో ప్రచారం కూడా సాగింది.

విజయ్ సీఎం అయినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ.. త్రిషకు విజయ్ గట్టిగా హ్యాండ్ ఇచ్చాడని టాక్. తిరుచిరాపల్లి నుంచి త్రిషను నిలబెట్టంలేదంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ స్థానం నుంచి మరో హీరో రంగంలోకి దిగబోతున్నాడట. ఆయన మరెమరో కాదు సౌత్ స్టార్ కొరియోగ్రఫర్ కమ్ హీరో రాఘవా లారెన్స్. ఇప్పటికే ఎంతో సమాజసేవ చేసి.. ఎందరో బ్రతుకల్లో వెలుగు నింపిన హీరో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఆయన టీవీకేలో జాయిన్ కాబోతున్నారని తమిళనాట భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.

సీన్ లోకి వచ్చిన ఆ మాస్ హీరో ఎవరు?

విజయ్ రాజీనామా చేసిన తిరుచిరాపల్లి నుంచి రాఘవా లారెన్స్ ను రంగంలోకి దింపాలని విజయ్ చూస్తున్నట్టు టాక్. ఈ విషయంలో అధికారికంగా బయటకు రాకపోయినా.. ప్రచారం మాత్రం భారీగా జరుగుతోంది. ఈరకంగా త్రిషకు విజయ్ షాక్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే.. తిరుచిరాపల్లి అభ్యర్ధి ఎవరో తేలాల్సి ఉంది. ఇక త్రిష మాత్రం విజయ్ తో కలిసి కనిపిస్తూనే ఉంది. రీసెంట్ గా స్టార్ హీరో అజిత్ తల్లి మరణించినప్పుడు విజయ్ త్రిష ఒకే కారులో వెళ్లి పరామర్శించడం కూడా వైరల్ ఇష్యూ అయ్యింది. మరి ముందు మందు ఏం జరగబోతోందో చూడాలి.

విజయ్ దళపతి నిర్ణయం తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుంది? త్రిష భవిష్యత్తు ఏంటి? సీన్ లోకి వచ్చిన ఆ స్టార్ హీరో ఎవరు? మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి చూడండి. తాజా పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.