|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జననాయగన్ దెబ్బ: విజయ్ సంచలన నిర్ణయం! నిర్మాత కోసం మరో సినిమా?

Published: 13-04-2026, 10:35 AM
జననాయగన్ దెబ్బ: విజయ్ సంచలన నిర్ణయం! నిర్మాత కోసం మరో సినిమా?
  • విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదల ఆలస్యం కావడం వలన నిర్మాతలకు నష్టం వాటిల్లింది.
  • నష్టాన్ని పూడ్చడానికి విజయ్ మరో సినిమా చేయడానికి అంగీకరించారు.
  • నెల్సన్ దిలీప్ కుమార్, అట్లీ, లోకేష్ కనగరాజ్ లలో ఒకరి దర్శకత్వంలో సినిమా ఉండవచ్చు.
  • విజయ్ ప్రస్తుతం రాజకీయ ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

విజయ్ తలపతి నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదల వాయిదా పడటంతో నిర్మాతలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో విజయ్ మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జననాయగన్ సినిమా విడుదల ఆలస్యం

Vijay Thalapathy: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ఈ సినిమా చుట్టూ రాజకీయ కుట్రలు ఉన్నాయని అందుకే సినిమా విడుదల ఆగిపోయింది అంటూ హీరో విజయ్ పలు సందర్భాలలో ఈ సినిమా వాయిదా పడటం వెనుక గల కారణాలను తెలియజేశారు. ఇప్పటికీ ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ రాని నేపథ్యంలో విడుదల కాలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల ఆలస్యం కావడంతో చిత్ర నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై జననాయగన్ (Jananayagan) సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కారణంగా నిర్మాణ సంస్థకు నష్టాలు రావడంతో ఈయన మరోసారి కేవిఎన్ బ్యానర్ లో సినిమా చేయటానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ లేదా అట్లీ, లోకేష్ కనగరాజ్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరితో సినిమా ఉంటుందని కోలీవుడ్ సమాచారం. జననాయగన్ విజయ్ ఆఖరి సినిమా అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే .ఈయన టీవీ కె పేరుతో పార్టీని స్థాపించారు. ప్రస్తుతం ఈయన రాజకీయ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

నిర్మాతలకు నష్టం వాటిల్లడంతో విజయ్ నిర్ణయం

ఇలా రాజకీయాలపై పూర్తిస్థాయిలో విజయ్ దృష్టి సారించబోతున్న నేపథ్యంలో ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పేసారు కానీ జననాయగన్ సినిమా వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తున్న నేపథ్యంలోనే ఇంకో సినిమా చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ సినిమా అంటే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి విజయ్ సినిమా గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇదే వార్తలు కనుక నిజమైతే విజయ్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ చూడవచ్చని అభిమానులు కూడా భావిస్తున్నారు.

పైరసీకి గురి అయిన జననాయగన్..

కొత్త సినిమా దర్శకుడు ఎవరు?

విజయ్ ప్రస్తుతం జననాయగన్ సినిమాని పూర్తిగా పక్కన పెట్టి పెద్ద ఎత్తున రాజకీయ ప్రచార కార్యక్రమాలలో బిజీ అయ్యారు.. ఏప్రిల్ చివరిన తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈయన రాజకీయ కార్యకలాపాలలో బిజీగా గడుపుతున్నారు. జననాయగన్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన నేపథ్యంలో ఈ సినిమాని తమిళనాడులో ఎన్నికలు పూర్తి అయిన తర్వాతనే విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇటీవల పైరసీకి గురి కావడంతో ఇలా పైరసీకి పాల్పడిన వారిపై చిత్ర నిర్మాతలు చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇలా సినిమా విడుదల కాకుండానే ఐదు నిమిషాల వీడియో క్లిప్ బయటకు రావడంతో చిత్ర నిర్మాతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, నిర్మాతలకు సహాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయం. ఈ సినిమాపై మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.