|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్, త్రిషల పెళ్లి నిజమేనా? ఒకే కారులో దర్శనం! కోలీవుడ్‌లో సంచలనం!

Published: 05-03-2026, 8:35 PM
విజయ్, త్రిషల పెళ్లి నిజమేనా? ఒకే కారులో దర్శనం! కోలీవుడ్‌లో సంచలనం!
  • విజయ్, త్రిషల పెళ్లి వార్తలకు ఊతమిచ్చిన తాజా సంఘటన!
  • తమిళ నిర్మాత ఇంట్లో జరిగిన పెళ్ళిలో కలిసి కనిపించిన విజయ్, త్రిష.
  • విడాకుల తరువాత ఓపెన్ అయిన విజయ్, త్రిష రిలేషన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్.
  • త్వరలోనే ఈ ఇద్దరి రిలేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

తమిళ స్టార్ విజయ్, హీరోయిన్ త్రిషల మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఒక పెళ్ళికి హాజరుకావడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అసలు వీరి మధ్య రిలేషన్ నిజమేనా?

విజయ్, త్రిషల పెళ్లి రూమర్స్ నిజమేనా?

Vijay- Trisha: తమిళ స్టార్ విజయ్ విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. ఆయన భార్య సంగీతం ఆయన నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అయితే, ఆమె తన భర్తకు వేరే హీరోయిన్ తో సంబంధాలు ఉన్నాయని, అందుకే విడాకులు కోరుతున్నట్టుగా పిటీషన్ లో తెలిపింది సంగీతం. దాంతో, ఆ న్యూస్ సంచలంగా మారింది. అంతేకాదు, విజయ్ తో సంబంధం ఉన్న ఆ హీరోయిన్ ఎవరు అంటూ కూడా ఆరాలు తీయడం మొదలుపెట్టేశారు అంతా.

ఒకే కారులో దర్శనమిచ్చిన ఈ జంట!

ఈనేపథ్యంలోనే గత కొంతకాలంగా విజయ్- త్రిష పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూరుస్తు విజయ్- త్రిష(Vijay- Trisha) కూడా కలిసి కనిపించారు. దాంతో, ఈ ఇద్దరి పెళ్లి మ్యాటర్ నిజమే అంటూ వార్తలు వినిపించాయి. విజయ్ భార్య చేసిన కామెంట్స్ కూడా నిజమే అని అనుకున్నారు అంతా. కానీ, తాజాగా మరోసారి విజయ్- త్రిష కలిసి కనిపించి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు.

కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా విడాకుల వ్యవహారం!

విజయ భార్య విడాకులు కోరిన తరువాత విజయ్-త్రిష ఇద్దరు కలిసి ఒక పెళ్ళికి అటెండ్ అయ్యారు. గురువారం తమిళ నిర్మాతకు ఇంట్లో జరిగిన ఓ పెళ్ళిలో ఈ ఇద్దరు కలిసి కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. దీనికి సంబందించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఈ ఇద్దరి మధ్య రిలేషన్ నిజమే అని,. విడాకుల మ్యాటర్ తరువాత ఓపెన్ అయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, విజయ్-త్రిష రిలేషన్ నిజమే అని అనిపిస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరి రిలేషన్ పై అధికారిక ప్రకనట వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

విజయ్, త్రిషల పెళ్లి వార్తలపై మీ అభిప్రాయం ఏమిటి? త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.