
📌 Key Points
- విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 404.58 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ప్రకటన.
- విజయ్ భార్య సంగీత పేరు మీద రూ. 15 కోట్లకు పైగా చరాస్తులు ఉన్నాయి.
- విజయ్ దంపతుల మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 537 కోట్లు.
- విజయ్ వద్ద ఖరీదైన కార్లు, బంగారు ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడి.
సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ఎన్నికల బరిలో నిలిచారు. తన నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆయన ఆస్తుల విలువ తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం.
విజయ్ ఎన్నికల అఫిడవిట్ వివరాలు
TVK Chief Vijay Assets సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సిద్ధమయ్యారు. తమిళనాడులోని పెరంబూర్, తిరుచ్చి నియోజకవర్గాల్లో ఆయన ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. విజయ్ తన ఎన్నికల అఫిడవిట్ లో రూ. 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, వాహనాలు, ఇతర చరాస్తులతో సహా అతని ఆర్థిక వివరాలను విజయ్ తెలియజేశారు. వాహనాలలో BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్‌ఫైర్ వంటి ఖరీదైన కార్లతో పాటు ఇతర ఆటోమొబైల్స్, బైక్ లు కూడా ఉన్నాయి.
2024–25లో రూ. 184.53 కోట్లు, 2023–24లో రూ. 105.69 కోట్లు, 2022–23లో రూ. 198.71 కోట్లు, 2021–22లో రూ. 237.46 కోట్లు, 2020–21లో రూ. 8.04 కోట్ల ఆదాయాన్ని అఫిడవిట్ లో తెలియజేశారు. అఫిడవిట్ ప్రకారం, విజయ్ భార్య 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,13,520 ఆదాయాన్ని ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌లో, చరాస్తులు, ఆదాయ వివరాలు తెలియజేశారు. తమ పార్టీ టీవీకేకు ఒక అవకాశం ఇవ్వాలని, ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో పార్టీ విజిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం, విజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. డీఎంకే ఒక దుష్టశక్తి అంటూ ఆరోపణలు చేశారు పునరుద్ఘాటించారు.
భార్య సంగీత ఆస్తుల విలువ
ఎన్నికల అఫిడవిట్ లో విజయ్ తన స్థిర చర ఆస్తులతో పాటు, తన భార్య సంగీత వద్ద ఉన్న ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఇందులో బ్యాంకు డిపాజిట్లు, ఆభరణాలు, లగ్జరీ వాహనాలున్నట్లు తెలియజేశారు. చరాస్తుల విలువ రూ. 404 కోట్లకు పైగా ఉండగా, స్థిరాస్తుల విలువ రూ. 115 కోట్లు. ఆయన భార్య సంగీత వద్ద రూ. 15 కోట్లకు పైగా విలువైన చరాస్తులు, సుమారు రూ. 2.5 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 537 కోట్లు. విజయ్ తన సంపదలో అధిక భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఖాతాలలో అధిక డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
తన వద్ద బంగారం, వెండి, వజ్రాలు ఉన్నట్లు విజయ్ అఫిడవిట్‌లో ఉన్నాయి. విజయ్, అతని భార్య వద్ద సుమారు 500 సవర్ల బంగారు ఆభరణాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ వద్ద 800 గ్రాములకు పైగా బంగారం సుమారు రూ. 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి. సంగీత ఆస్తులలో 3 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు, సుమారు రూ. 1 కోటి విలువైన వజ్రాలు కలిగి ఉన్నారు. ఆమె వద్ద సుమారు 2 కేజీల వెండి ఉంది.
విజయ్ దంపతుల మొత్తం ఆస్తుల వివరాలు
విజయ్ తన వద్ద రూ. 2 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. BMW మోడళ్లు, టయోటా లెక్సస్ మరియు టయోటా వెల్‌ఫైర్ వంటి అనేక లగ్జరీ కార్లతో పాటు మారుతి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్స్ ఎల్ సూపర్ కూడా ఉన్నాయి. విజయ్ రూ. 184 కోట్ల విలువైన ఆస్తులపై ఆదాయపు పన్ను చెల్లించారు.
మొత్తానికి విజయ్ తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేయడంతో ఆయన సంపదపై ఒక స్పష్టత వచ్చింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, విజయ్ ఆస్తుల గురించి మాత్రం హాట్ టాపిక్ నడుస్తోంది.


