|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీఎం అవుతాననే ధీమా! విజ‌య్ గెలుపు వ్యూహం: ఎవరూ ఎక్కడికీ వెళ్ళొద్దు!

Published: 30-04-2026, 8:27 PM
సీఎం అవుతాననే ధీమా! విజ‌య్ గెలుపు వ్యూహం: ఎవరూ ఎక్కడికీ వెళ్ళొద్దు!
  • త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌య్ టీవీకే పార్టీ బ‌రిలో దిగింది.
  • హంగ్ ఏర్పడితే విజ‌య్ పార్టీకి కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంది.
  • గెలిచిన అభ్య‌ర్థులు సంబ‌రాలకు వెళ్లకుండా నేరుగా ప‌నైయూర్ కు రావాలి.
  • విశ్లేష‌కుల అంచనా ప్రకారం, విజ‌య్ సీఎం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

తమిళనాడు ఎన్నికల్లో విజ‌య్ టీవీకే పార్టీ తొలిసారి బరిలోకి దిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య, సీఎం పీఠంపై విజ‌య్ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో, ఎన్నికల ఫలితాలపై ధీమాతో, తన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

తొలిసారి బ‌రిలో విజ‌య్ టీవీకే పార్టీ

ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో స్టార్ హీరో విజ‌య్ పార్టీ టీవీకే తొలిసారి బ‌రిలో దిగింది. ఎన్నిక‌ల త‌ర‌వాత వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ లో డీఎంకేనే మ‌రోసారి విజ‌యం సాధిస్తుంద‌ని తేలినా విజ‌య్ పార్టీకి కూడా ఎక్కువే స్థానాలు వ‌స్తాయ‌ని కూడా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒకవేళ హంగ్ ఏర్పడితే విజయ్ పార్టీకి కూడా ప్రభుత్వం ఏర్పడటంతో కీ రోల్ పోశించే అవకాశం ఉంది. అదృష్టం క‌లిసి వ‌స్తే విజ‌య్ సీఎం అయ్యే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో విజ‌య్ ముందే బ‌రిలో దిగిన అభ్య‌ర్థుల‌ను గ్రిప్ లో పెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో నేడు పార్టీ నేత‌ల‌తో ముఖ్య స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. అభ్య‌ర్థుల‌కు సూచ‌న‌గా కాకుండా విజ‌య్ చెప్ప‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గెలిచిన త‌ర‌వాత ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్ల‌వ‌ద్ద‌ని నేరుగా ప‌నైయూర్ కు రావాల‌ని విజ‌య్ ఆదేశించారు. సంబ‌రాలు అంటూ మీ నియోజ‌క‌వ‌ర్గాలకు కూడా వెళ్లొద్ద‌ని హెచ్చ‌రించారు. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర‌వాత తిరిగి నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లాల‌ని అన్నారు. తాను ఇక్క‌డే గెలిచిన నేత‌ల కోసం ఎదురుచూస్తాన‌ని, మ‌నం గెలుస్తామ‌నే న‌మ్మ‌కం నాకు ఉంది అంటూ విజ‌య్ వ్యాఖ్యానించారు. దీంతో విజ‌య్ టీవీకే గెలుపుపై ధీమాగా ఉన్నార‌ని అర్థం అవుతోంది.

సీఎం పీఠంపై విజ‌య్ ధీమా

గెలిచిన నేతలకు విజ‌య్ ఆదేశాలు

విజ‌య్ తన పార్టీ గెలుపుపై, సీఎం అయ్యే అవకాశాలపై పూర్తి ధీమాతో ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తన అభ్యర్థులపై గట్టి పట్టు సాధించేందుకు ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.