|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరల్: విజయ్ ఆరోగ్య రహస్యం బట్టబయలు! ఫిట్‌నెస్ ట్రైనర్ సంచలన కామెంట్స్!

Published: 13-05-2026, 5:30 AM
వైరల్: విజయ్ ఆరోగ్య రహస్యం బట్టబయలు! ఫిట్‌నెస్ ట్రైనర్ సంచలన కామెంట్స్!
  • విజయ్ ఫిట్‌నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ సంచలన కామెంట్స్! స్టార్ ఆరోగ్యంపై పూర్తి వివరాలు.
  • 51 ఏళ్ల వయసులోనూ యువకులకు పోటీగా విజయ్. ఆయన క్రమశిక్షణే దీనికి కారణం.
  • మోకాలి సమస్యలు, నడుము నొప్పి లేవు. రెగ్యులర్ వ్యాయామమే విజయ్ ఆరోగ్య రహస్యం.
  • సైక్లింగ్, రన్నింగ్, జిమ్‌లో ఎక్కువ సమయం. బయటి ఆహారం తినని విజయ్.

తమిళ సూపర్ స్టార్ విజయ్ కేవలం రాజకీయాల్లోనే కాదు, ఫిట్‌నెస్‌లోనూ యువకులకు ఆదర్శం! 51 ఏళ్ల వయసులోనూ ఆయన ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటి? ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ తాజాగా వెల్లడించిన సంచలన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

విజయ్ ఫిట్‌నెస్ సీక్రెట్ బట్టబయలు!

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లకే తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో విజయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. దీంతో పలువురు సెలబ్రిటీలు, విజయ్ తో అనుబంధం ఉన్న వ్యక్తులు ఆయన గురించి చెప్తున్నారు.

ఈ క్రమంలో విజయ్ ఫిట్నెస్ ట్రైనర్ నరేష్ కుమార్ తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ హెల్త్, ఫిట్నెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

51 ఏళ్ల వయసులోనూ యువకుడిలా!

నరేష్ కుమార్ మాట్లాడుతూ.. విజయ్ మొదట్నుంచి డెడికేషన్, క్రమశిక్షతో ఉండేవారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేసేవారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా తన ఫుడ్, వ్యాయమ పద్దతులను వదల్లేదు. ర్యాలీల కోసం బయటకు వెళ్తే ఇంటి దగ్గర్నుంచి ఫుడ్ తీసుకెళ్లేవారు. ఆయన బయటి ఫుడ్ అసలు తినరు.

ఆరోగ్య సమస్యలు లేవన్న ట్రైనర్!

51 ఏళ్ళ వయసులో కూడా ఆయన యువకులకు పోటీగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయడానికి ఆయన క్రమశిక్షణ, కష్టం ఉంది. ఆయన ఎక్కువ సైక్లింగ్, రన్నింగ్ చేస్తారు. ఒత్తిడి ఉన్నప్పుడు జిమ్ లో ఎక్కువగా గడిపి మనసును తేలికపరుచుకుంటారు. ఇప్పటివరకు కూడా ఆయనకు మోకాలి సమస్యలు, నడుము నొప్పి.. లాంటి ఏ ఆరోగ్య సమస్యలు లేవు. రెగ్యులర్ గా వ్యాయామం చేయడమే ఇందుకు కారణం అని తెలిపారు.

ఇలాంటి అంకితభావం, క్రమశిక్షణే విజయ్ విజయ రహస్యం. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోవడం అభినందనీయం. ఈ సంచలన విషయాలు అభిమానులకు స్ఫూర్తినిస్తాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.