
📌 Key Points
- విజయ్ ‘జన నాయగన్’ సినిమా జనవరి 9న విడుదల కావట్లేదని స్పష్టం.
- సెన్సార్ సర్టిఫికెట్ వివాదంపై మద్రాస్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
- రూ.500 కోట్ల పెట్టుబడి, జనవరి 9 విడుదల తేదీపై నిర్మాతల ఆందోళన.
- సినిమాలోని కొన్ని అంశాలు, రక్షణ దళాల చిహ్నాల వినియోగంపై సీబీఎఫ్‌సీ అభ్యంతరాలు.
విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా పడింది. సెన్సార్ వివాదంపై మద్రాస్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో జనవరి 9న విడుదల అసాధ్యంగా మారింది. ఈ పరిణామం అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
సెన్సార్ వివాదమే అసలు కారణమా?
Jana Nayagan Postponed: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా జన నాయగన్ జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలపై చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం.. సెన్సార్‌కు సంబంధించిన కేసులో మద్రాస్ హైకోర్టు.. తన తీర్పును రిజర్వ్ చేయడమే.
జన నాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుండటంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ పీటీ ఆశ విన్నారు. సినిమా ఇప్పటికే పరీక్షా కమిటీ సూచించిన 27 కట్లు చేసినప్పటికీ..మళ్లీ రివైజింగ్ కమిటీకి పంపడంపై నిర్మాతలు అభ్యంతరం తెలిపారు.
ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే Central Board of Film Certification తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. పరీక్షా కమిటీ సూచనలపై ఛైర్‌పర్సన్ సంతృప్తి చెందకపోతే..మళ్లీ రివ్యూ కమిటీకి పంపే అధికారం ఉందని సీబీఎఫ్‌సీ తెలిపింది. అలాగే..ఈ విషయాన్ని జనవరి 5న ఈమెయిల్ ద్వారా నిర్మాతలకు తెలియజేశామని పేర్కొంది.
నిర్మాతల వాదనలు: రూ.500 కోట్ల పెట్టుబడి
మరోవైపు..నిర్మాత సంస్థ KVN Studios తమ వాదనను బలంగా వినిపించింది. పరీక్షా కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యుల్లో ఎక్కువ మంది యూ/ఏ 16+ సర్టిఫికెట్‌కు అంగీకరించారని..ఒక్క సభ్యుడి ఫిర్యాదు ఆధారంగా మొత్తం నిర్ణయాన్ని మార్చడం సరికాదని తెలిపింది. అంతేకాదు..ఈ సినిమాపై దాదాపు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టామని..జనవరి 9 విడుదల తేదీని ముందే ప్రకటించామని కోర్టుకు వివరించింది.
సీబీఎఫ్‌సీ మాత్రం.. సినిమాలో కొన్ని అంశాలు ఒక వర్గ భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదు వచ్చిందని తెలిపింది. అలాగే.. రక్షణ దళాలకు సంబంధించిన చిహ్నాల వినియోగంపైనా అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంది.
ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత, మద్రాస్ హైకోర్టు తన ఆదేశాలను రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో.. కోర్టు తీర్పు జనవరి 9 ఉదయం వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంటే సాంకేతికంగా చూస్తే, జన నాయగన్ సినిమా జనవరి 9న విడుదల కావడం కష్టమే. ముఖ్యంగా అప్పటికప్పుడు కోర్టు తీర్పు వచ్చి అప్పటికప్పుడు టికెట్లు విడుదల చేసి బుక్ అవుదం అనేది అస్సలు సాధ్యం కానీ విషయం. కాబట్టి జనవరి 9 ఈ చిత్రం విడుదల అవ్వడం అసాధ్యమే. కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతే సినిమా కొత్త విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశముంది.
హైకోర్టు తీర్పు తర్వాతే కొత్త విడుదల తేదీ?
ఈ సినిమా విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో తమిళనాడులో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి చివరికి ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి..
జనవరి 9న “జన నాయగన్” విడుదల వాయిదా పడింది. సెన్సార్ వివాదంపై హైకోర్టు తీర్పు తర్వాతే కొత్త తేదీపై స్పష్టత వస్తుంది. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ భవిష్యత్తు ఉత్కంఠగా మారింది.

