|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్ సృష్టించిన రికార్డులు! 24 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయో చూస్తే షాక్!

Published: 06-01-2026, 5:00 AM
విజయ్ 'జన నాయకుడు' ట్రైలర్ సృష్టించిన రికార్డులు! 24 గంటల్లో ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయో చూస్తే షాక్!
  • విజయ్ చివరి సినిమా ‘జన నాయకుడు’ సంక్రాంతికి జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల.
  • హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది.
  • మలేషియాలో ఘనంగా జరిగిన ఆడియో లాంచ్‌కు భారీ స్పందన లభించింది.
  • ట్రైలర్ 24 గంటల్లో యూట్యూబ్‌లో 83.7 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 31 మిలియన్ వ్యూస్ సాధించింది.

సౌత్ స్టార్ విజయ్ చివరి చిత్రం ‘జన నాయకుడు’ ట్రైలర్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సంచలనం సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే లక్షల వ్యూస్‌తో రికార్డులు బద్దలు కొట్టింది. జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

విజయ్ చివరి చిత్రం: ‘జన నాయకుడు’ విశేషాలు

సౌత్ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా జన నాయకుడు. సంక్రాంతి కానుకగా ఈసినిమా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ట్రైలర్ సృష్టించిన వ్యూస్ సునామీ

విజయ్ చివరి సినిమా కావడంతో జన నాయకుడు సినిమాపై భారీ అంచనాలు, ఆసక్తి నెలకొంది. కొద్ది రోజుల క్రితం మలేషియాలో ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం రిసెంట్ గా ఓ ఛానెల్‌లో ప్రసారమవ్వగా భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. మలేషియాలో జరిగిన ఈ ఆడియో లాంచ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మూవీ టీమ్ అభిమానులు పంచుకున్నారు.

సినిమాపై భారీ అంచనాలు, విడుదల తేదీ

ఇక తాజాగా జన నాయకుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కు భారీగా రెప్పాన్స్ వస్తోంది.  యూట్యూబ్‌లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదిస్తోంది.  మొదటి 24 గంటల్లోనే ఈ ట్రైలర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 31 మిలియన్లు,  యూట్యూబ్‌లో 83.7 మిలియన్ల ప్యూస్ ను సాధించి దూసుకుపోతోంది. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ట్రైలర్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన చూస్తుంటే, ‘జన నాయకుడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ చివరి సినిమాగా ఇది ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.