
అశోక్ గల్లా నటించిన తాజా చిత్రం ‘వింటారా సరదాగా’కు సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్లు వచ్చాయి. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు, టీజర్ విడుదల తేదీని కూడా ప్రకటించారు. అమెరికా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం…
Key Points
అశోక్ గల్లా మూడో సినిమా ‘వింటారా సరదాగా’ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
జూలై 12న ఉదయం 10:53 గంటలకు టీజర్ విడుదల
అమెరికా నేపథ్యంలో విదేశాల్లో చదువుకునే భారతీయుల జీవితాల చిత్రీకరణ
శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ కీలక పాత్రల్లో
‘వింటారా సరదాగా’ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
గత కొద్ది రోజుల నుంచి స్టార్ హీరోల ఫ్యామిలీకి సంబంధించిన వారు సినిమా ఇండస్ట్రీలోకి వస్తూ తమ టాలెంట్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఊహించిన విధంగా ఫేమ్ తెచ్చుకోలేకపోతున్నారు. ఇక ఇటీవల మహేష్ బాబు మేనల్లుడ అశోక్ గల్లా హీరో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. ఆ తర్వాత నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా, అశోక్ గల్లా(Ashok Galla) తన మూడో చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి ‘వీసా వింటారా సరదాగా’(VintaraSaradaga ) అనే ట్యాగ్ లైన్‌తో రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ పోస్టర్‌లో అశోక్ గల్లా కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించగా.. ఆయన పక్కన హీరోయిన్ నవ్వుతూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తోంది.
ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ టీజర్ జూలై 12న ఉదయం 10:53 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘కలలు, నాటకం, ప్రేమతో నిండిన విచిత్రమైన ప్రయాణం’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ సినిమాను నూతన దర్శకుడు ఉద్భవ్ (Udbhav)తెరకెక్కిస్తున్నారు. ఇందులో అశోక్ గల్లా సరసన శ్రీ గౌరీ ప్రియ(Sri Gauri Priya) హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విదేశాల్లో భారతీయ విద్యార్థుల జీవితాలను, కలలను, స్నేహాలను, మధుర క్షణాలను చూపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
టీజర్ విడుదల తేదీ ప్రకటన
సినిమా కథాంశం, నటీనటుల వివరాలు
మొత్తంగా, ‘వింటారా సరదాగా’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అశోక్ గల్లా కెరీర్‌లో ఈ సినిమా ఎలాంటి మలుపు తీసుకువస్తుందో చూడాలి.


