|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vir Das: విమానంలో కూర్చోని సీటు లేదు, ఎయిరిండియాకే నా సపోర్ట్‌.. నెటిజన్ల ఆగ్రహం

Published: 21-06-2025, 4:11 AM
Vir Das: విమానంలో కూర్చోని సీటు లేదు, ఎయిరిండియాకే నా సపోర్ట్‌.. నెటిజన్ల ఆగ్రహం

బాలీవుడ్ నటుడు విర్ దాస్ తన ఎయిర్ ఇండియా ప్రయాణ అనుభవాన్ని పంచుకుంటూ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ ట్వీట్‌ వివాదాస్పదమైంది.

Key Points

1

విర్ దాస్ ఎయిర్ ఇండియాకు మద్దతు తెలిపిన ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం.

2

విమాన ప్రమాదం తరువాత కూడా ఎయిర్ ఇండియా సిబ్బంది పట్ల విర్ దాస్ అభిమానం వ్యక్తం.

4

పీఆర్ స్టంట్ కాదని విర్ దాస్ వివరణ ఇచ్చినా నెటిజన్లు నమ్మలేదు.

ఎయిర్ ఇండియాకు మద్దతుగా విర్ దాస్ ట్వీట్

బాలీవుడ్‌ నటుడు, కమెడియన్‌ విర్‌ దాస్‌ ( Vir Das ) చిక్కుల్లో పడ్డాడు. ఎయిరిండియాకు సపోర్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేయడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 241 మంది మరణించారు. అంతమంది చావుకు కారణమైన ఎయిరిండియాను పొగుడుతూ తాజాగా అతడు ఓ ట్వీట్‌ వేశాడు.

పీఆర్‌ స్టంట్‌? నేను లండన్‌ నుంచి ఇంటికి ఎయిరిండియా ( Air India ) విమానంలోనే వచ్చాను. నాకెంతో గొప్పగా అనిపించింది. సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. వారిది ఎంతో మంచి మనసు అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఫ్రీ టికెట్‌ ఇచ్చారా?, ఈ చెత్త పీఆర్‌ స్టంట్‌ చేసేవారికి నేను చెప్పేది ఒక్కటే.. ఇలాంటి సమయంలో ఈ ట్వీట్లు వేయడం బాధాకరం. మీ స్థాయిని మీరే తగ్గించేసుకుంటున్నారు అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్ల ఆగ్రహం, విమర్శలు

మా తాత.. దాంతో విర్‌ దాస్‌.. తనది పీఆర్‌ స్టంట్‌ కాదని వివరణ ఇచ్చాడు. ఎయిరిండియాకు నేనెందుకు సపోర్ట్‌ చేస్తున్నానో మీకు చెప్తాను.. మా తాత ఎయిరిండియాలోనే పని చేసేవాడు. ఆ సంస్థ విమానాల్లోనే నేను నలుమూలలా ప్రయాణించాను. ఆ విమానాల్లో నేను కూర్చోని సీటు అంటూ లేదు. అయితే, ఈ ఎయిరిండియాలో కొన్ని సమస్యలున్నాయి. కానీ, ఏ సిబ్బంది కూడా మిమ్మల్ని చులకనగా చూడరు. నవ్వుతూ ఆహ్వానిస్తారు. వారిని కూడా ఈ విమాన ప్రమాదంలో మనం కోల్పోయాం. ఈ నష్టాన్నెందుకు ఎవరూ గుర్తించడం లేదు. నేను మాత్రం వారికి మద్దతిస్తున్నాను అని క్లారిటీ ఇచ్చాడు. అనంతరం ఈ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు.

అప్పుడు కూడా ఇంతే! జూన్‌ 12న అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం జరిగినప్పుడు కూడా విర్‌ దాస్‌ ఎయిరిండియాకు సపోర్ట్‌ ఇచ్చాడు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన రోజు ఇది! వారి కుటుంబాలకు ఇదే నా ప్రగాఢ సానుభూతి. విమాన సిబ్బందికి కూడా నా సపోర్ట్‌ తెలియజేస్తున్నాను. నా జీవితం మొత్తం ఎయిరిండియాలోనే తిరిగాను. ఇక్కడ సమస్యలు లేవని కాదు, కానీ, ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు. కానీ, ఎయిరిండియాలో పనిచేసే సిబ్బంది బెస్ట్‌ క్రూ అని మాత్రం బాగా తెలుసు. అసలు ఈ విషాదం ఎలా జరిగిందనేది సమయమే నిర్ధారిస్తుంది. పని చేస్తున్న ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోవడం ఎంత బాధాకరమో ఊహకు అందకుండా ఉంది అని ట్వీట్‌ చేశాడు.

విర్ దాస్ వివరణ

విర్ దాస్ వివరణతో నెటిజన్లు సంతృప్తి చెందలేదు. ఎయిర్ ఇండియా ప్రమాదంపై దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. విర్ దాస్ ట్వీట్‌ చర్చనీయాంశమైంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.