|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ ఆస్తుల చిట్టా లీక్: భార్య ఆస్తులు చూసి షాక్ అయిన నెటిజన్లు!

Published: 31-03-2026, 3:35 AM
విజయ్ ఆస్తుల చిట్టా లీక్: భార్య ఆస్తులు చూసి షాక్ అయిన నెటిజన్లు!
  • విజయ్ దళపతి ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులతో పాటు భార్య సంగీత ఆస్తుల వివరాలు వెల్లడించారు.
  • విజయ్ మొత్తం చరాస్తుల విలువ రూ.404.58 కోట్లుగా ఉంది, ఇందులో నగదు, బ్యాంకు డిపాజిట్లు, వాహనాలు ఉన్నాయి.
  • సంగీత వద్ద 3 కేజీల బంగారం, 2 కేజీల వెండి, కోటి రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయని విజయ్ పేర్కొన్నారు.
  • విజయ్ గత ఐదేళ్లలో ఆర్జించిన ఆదాయ వివరాలను కూడా అఫిడవిట్‌లో పొందుపరిచారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తన ఎన్నికల అఫిడవిట్‌లో తన మరియు తన భార్య సంగీత ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ వివరాలు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ ఆస్తుల వివరాలు

Vijay Thalapathy: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న విజయ్ దళపతి ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు టీవీకే పార్టీని స్థాపించి తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తొలిసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎన్నికల తేదీ వెలువడడంతో పెరంబూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు విజయ్ దళపతి. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరిచిన విషయం తెలిసిందే . అయితే ఇక్కడ తన భార్య సంగీత ఆస్తులను కూడా ఆయన జమ చేశారు. కానీ అసలు ట్విస్ట్ తెలిసి అభిమానులు ఆశ్చర్యపోగా.. నెటిజన్లు విజయ్ పై మండిపడుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

విజయ్ దళపతి తన ఆస్తుల వివరాలను.. బ్యాంకు డిపాజిట్లు , స్థిరాస్తులు, వాహనాలు వంటి ఇతర వివరాలను పొందుపరిచారు . అలా మొత్తంగా రూ.404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అందులో నగదు రూపంలో తన వద్ద 2 లక్షలు, తన భార్య సంగీత వద్ద లక్ష రూపాయలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివిధ బ్యాంకులలో సేవింగ్స్, పిక్స్డి డిపాజిట్ల రూపంలో రూ.213 కోట్లు ఉన్నట్లు తెలిపిన విజయ్ దళపతి.. తన వద్ద బిఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫేర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయని.. మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఇక వాహనాల మొత్తం విలువ రూ.14.35 కోట్లు అని వెల్లడించారు. అలాగే తన వద్ద 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయని , 198 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు విజయ్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

సంగీత ఆస్తులపై నెటిజన్ల రియాక్షన్

ఇకపోతే 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో రూ.184.53 కోట్ల ఆదాయం ఆర్జించినట్టు తెలిపిన విజయ్.. 2023 – 24లో రూ.105.69 కోట్లు, 2022 – 23లో రూ.198.1 కోట్లు, 2021 – 22లో రూ.237.46 కోట్లు, 2020 – 2021లో కేవలం రూ.8.04 కోట్ల ఆదాయం వచ్చినట్లు విజయ్ తెలిపారు. ఇక ప్రస్తుతం పెరంబూర్ తూర్పు తిరుచ్చి అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారు.

ఇక ఇదంతా బాగానే ఉన్నా విజయ్ దళపతి తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరిచినప్పుడు తన భార్య సంగీత ఆస్తుల వివరాలను కూడా ఆయన తన అఫిడవిట్ లో చేర్చారు. తన భార్య సంగీత వద్ద 4.07 కోట్ల విలువైన 3 కేజీల బంగారం, రెండు కేజీల వెండితో పాటు కోటి రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయి. సంగీత మొత్తం చరాస్తుల విలువ రూ.15.51 కోట్లు , స్థిరాస్తుల విలువ 25 కోట్లుగా వెల్లడించారు . ఇకపోతే 2021 నుండి తన భార్య పేరు మీద ఎలాంటి ఆధారం నమోదు కాలేదని విజయ్ తెలిపారు.

ఎన్నికల బరిలో విజయ్ దళపతి

ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా.. 2021 నుండి విజయ్ ఎందుకు తన భార్య సంగీత మీద ఆస్తులు కొనుగోలు చేయలేదు.. త్రిషతో ఉన్న ఆ బంధం కారణంగానే తన భార్య పేరు మీద ఆస్తులు కొనుగోలు చేయలేదా మండిపడుతున్నారు. మరి దీనిపై విజయ్ ఏదైనా స్పందిస్తారో చూడాలి.

విజయ్ దళపతి ఆస్తుల వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రానున్న ఎన్నికలలో ఆయన విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.