|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

VIRAATAPALEM Official Trailer: ‘పెళ్లి రోజే వధువు మరణిస్తే’.. ఆసక్తిగా టాలీవుడ్ థ్రిల్లర్ ట్రైలర్‌!

Published: 19-06-2025, 6:59 AM
VIRAATAPALEM Official Trailer: 'పెళ్లి రోజే వధువు మరణిస్తే'.. ఆసక్తిగా టాలీవుడ్ థ్రిల్లర్ ట్రైలర్‌!

ఓటీటీలలో థ్రిల్లర్ కంటెంట్‌కు డిమాండ్ పెరుగుతోంది. తాజాగా విడుదలైన విరాటపాలెం వెబ్ సిరీస్ ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తోంది. పెళ్లి రోజు వధువు మరణం ఈ సిరీస్ కథాంశం.

పెళ్లి రోజు మరణం

ఓటీటీలు వచ్చాక హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌ కంటెంట్‌కు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఈ జోనర్‌లో ఎక్కువగా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ అలరించేందుకు వస్తోంది. యూట్యూబర్ అభిజ్ఞ కానిస్టేబుల్‌గా నటిస్తున్న ఈ థ్రిల్లర్‪‌కి ‘విరాటపాలెం’. ఇటీవలే  ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌కు పొల్లూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూస్తే ఓ గ్రామంలో పెళ్లైన వధువు అదే రోజు రాత్రి మరణిస్తుంది. ఇదంతా ఆ ఊరికి ఉన్న శాపం వల్లే గ్రామస్తులు భావిస్తారు. కానీ ఆ ఊరికి వచ్చిన లేడీ కానిస్టేబుల్‌ దీని వెనుక ఉన్న గుట్టును బయట పెట్టేందుకు యత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లతో ఈ కథను ఆసక్తికరంగా తెరెకెక్కించారు. ఈ సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్  జూన్ 27న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి.

గ్రామ రహస్యం

కానిస్టేబుల్ విచారణ

విరాటపాలెం వెబ్ సిరీస్ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. జూన్ 27న జీ5 లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. అభిజ్ఞ నటన ఆకట్టుకునేలా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.