|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ ఫొటోలు నా కొడుకు చేస్తే ప‌రిస్థితి ఏంటి.? వైర‌ల్ భామ గిరిజ ఆవేద‌న

Published: 16-11-2025, 1:57 AM
ఆ ఫొటోలు నా కొడుకు చేస్తే ప‌రిస్థితి ఏంటి.? వైర‌ల్ భామ గిరిజ ఆవేద‌న

సోషల్ మీడియాలో అనూహ్యంగా పాపులర్ అయిన నటి గిరిజ ఓక్, తన ఫోటోల మార్ఫింగ్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు పెద్దయ్యాక వీటిని చూస్తే ఎంత బాధపడతాడో అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు సమాజానికి ఎంత హానికరో స్పష్టం చేశారు.

Key Points

1

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్‌ల ద్వారా గిరిజ ఓక్ అనూహ్యంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

2

ఆమె పాత ఫోటోలను AI సహాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు.

4

వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయవద్దని, ఆస్వాదించవద్దని గిరిజ ఓక్ హెచ్చరించింది.

సోషల్ మీడియాలో గిరిజ ఓక్ అనూహ్య గుర్తింపు

కొంతమందికి తొలి సినిమాతోనే గుర్తింపు వస్తుంది. ఇంకొందరికి పెద్ద హిట్ ప‌డే వ‌ర‌కు స‌రైన గుర్తింపు రాదు. అయితే గిరిజ ఓక్‌కు ఇది పూర్తిగా భిన్నం. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్‌ల వల్ల ఈ మరాఠి నటి అకస్మాత్తుగా ట్రెండింగ్‌లోకి వెళ్లింది. హిందీ, మరాఠి, కన్నడ చిత్రాల్లో నటించినప్పటికీ ఇంత భారీ అటెన్షన్ ఎప్పుడూ రాలేదు. అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో స్క్రోల్ చేస్తే చాలు.. ప్ర‌తీ ఒక్క‌రి వాల్‌పై ఈ బ్యూటీ క‌నిపిస్తోంది.

సడన్‌గా వచ్చిన ఈ ఫేమ్‌పై గిరిజ ఆనందం వ్యక్తం చేసింది. ఫ్యాన్స్ ప్రేమ చూసి షాకయ్యానని చెప్పింది. కాల్స్, మెసేజ్‌లు వరుసగా వస్తుండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. కొన్ని మీమ్స్ చూసి నవ్వుకుందట. అయితే ఈ సరదా మధ్య ఆమెను కలిచివేసిన విషయం కూడా ఒకటుంది. అదే విష‌యాన్ని గిరిజ‌ ప్ర‌స్తావించారు.

మార్ఫింగ్ ఫోటోలపై నటి గిరిజ ఆవేదన

నెట్టింట ట్రెండ్ కావ‌డంతో గిరిజ ఓక్ పాత ఫొటోల‌ను ఏఐ స‌హాయంతో అస‌భ్య‌క‌రంగా మార్ఫింగ్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫొటోల‌పై గిరిజ అసహనం వ్యక్తం చేశారు. “ఇప్పుడు నా బాబు సోషల్ మీడియా వాడడంలేదు. కానీ రేపు వాడతాడు కదా? అప్పుడు ఇలాంటి ఎడిటింగ్ ఫోటోలు చూస్తే ఎంత బాధపడతాడు?” అని ప్ర‌శ్నించారు

వ్యూస్ కోసం ఇలాంటి అసంబద్ధ ఎడిట్లు చేసే వారిపై ఆమె తీవ్రంగా మండిప‌డ్డారు. “ఏ అమ్మాయి ఫోటో అయినా ఇలా మార్చే ముందు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పనులు చేసే వాళ్లు తప్పు చేస్తున్నారు. ఆ ఫోటోలను ఆస్వాదించే వాళ్లు కూడా ఈ తప్పులో భాగం అవుతారు” అని హెచ్చరించారు. సోషల్ మీడియాలో హద్దులు లేకుండా జరుగుతున్న ఈ ప్రవర్తనపై నియంత్రణ అవసరమని సూచించారు.

ఆన్‌లైన్‌లో బాధ్యతాయుత ప్రవర్తన ఆవశ్యకత

A post shared by Girija Oak Godbole (@girijaoakgodbole)

తనపై వచ్చిన దృష్టిని పాజిటివ్ దిశలోకి మళ్లించాలని గిరిజ కోరుకుంది. “ఇవన్నీ పక్కనపెడితే, నా సినిమాలు, సిరీస్‌లు చూస్తే నాకు అదే పెద్ద ఆనందం” అని చెప్పుకొచ్చారు. తారే జమీన్ పర్‌, షోర్ ఇన్ ద సిటీ, జవాన్, ద వ్యాక్సిన్ వార్‌, ఇన్‌స్పెక్టర్ జిండె వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన గిరిజ ఇప్పుడు సోషల్ మీడియా లైమ్‌లైట్‌లో ఉన్న విష‌యం తెలిసిందే.

గిరిజ ఓక్ సంఘటన ఆన్‌లైన్‌లో కంటెంట్ సృష్టికర్తలు, వినియోగదారులు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను గౌరవిస్తూ, సామాజిక మాధ్యమాలను మంచికి ఉపయోగించాలని ఆమె విజ్ఞప్తి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.