|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ – అమ్మవారి శాపం, రక్తం కక్కుకుని చచ్చే కొత్త పెళ్లి కూతుళ్లు – ఎక్కడంటే?

Published: 27-06-2025, 2:54 AM
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ - అమ్మవారి శాపం, రక్తం కక్కుకుని చచ్చే కొత్త పెళ్లి కూతుళ్లు - ఎక్కడంటే?

ఓటీటీలో హారర్ థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు ‘విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్’ అనే కొత్త వెబ్ సిరీస్ వచ్చింది. కొత్త పెళ్లికూతుళ్ళ మరణాల రహస్యాన్ని ఈ సిరీస్ చూపుతుంది.

Key Points

1

విరాటపాలెం గ్రామంలో కొత్త పెళ్లికూతుళ్ళు రక్తం కక్కి చనిపోతున్నారు.

2

అమ్మవారి శాపం అని గ్రామస్తులు నమ్ముతున్నారు.

4

జీ5 లో ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

రక్తం కక్కుతూ చనిపోతున్న కొత్త పెళ్ళికూతుళ్ళు

ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూ అలరిస్తుంటాయి. వాటిలో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎక్కువగా ఎంగేజ్ చేసే కాన్సెప్ట్ భయం. అవును, ఓటీటీ హారర్ థ్రిల్లర్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే రెగ్యులర్‌గా ఈ జోనర్‌కు ఇతర అంశాలు యాడ్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు.

అలా ఇవాళ ఓటీటలోకి వచ్చిన తెలుగు సిరీసే విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ వెబ్ సిరీస్‌కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఇదివరకు ఓటీటీలో సూపర్ హిట్ అయిన రెక్కీ వెబ్ సిరీస్ నిర్మాతలు ఈ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్‌ను రూపొందించారు.

అమ్మవారి శాపమా? లేక హత్యలా?

ఛాయ్ బిస్కెట్ ఫేమ్ అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్‌ మూఢ నమ్మకాలు, అంతు చిక్కని కొత్త పెళ్లి కూతుళ్ల మరణాలు వంటి అంశాలతో థ్రిల్లింగ్‌గా సాగుతుంది. విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ కథలోకి వెళితే విరాటపాలెం గ్రామంలో కొత్తగా పెళ్లి అయిన నవ వధువులంత రక్తం కక్కుని చచ్చిపోతుంటారు.

ఆ గ్రామానికి అమ్మవారు శాపం పెట్టిందని, అందుకే కొత్త పెళ్లి కూతుళ్లు వివాహం జరగ్గానే మరణిస్తున్నారని గ్రామ ప్రజలు నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ మీనా ఆ మరణాలను కళ్లారా చూస్తుంది. అది చూసి చలించిపోయిన మీనా ఆ కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తుంది.

పోలీస్ కానిస్టేబుల్ మీనా దర్యాప్తు

ఈ క్రమంలోనే మీనా ఏం తెలుసుకుంది? అసలు పెళ్లి కూతుళ్లవి అమ్మవారి శాపంతో జరిగిన మరణాల? లేదా హత్యలా? అనేది విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్‌లోని ఇంట్రెస్టింగ్ అంశాలు. ఇలాంటి సీన్లతో సాగే విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీలోకి ఇవాళ వచ్చింది.

హారర్ అంశాలు ఉన్న విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ జీ5 లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (జూన్ 27) జీ5లో తెలుగు భాషలో హారర్ థ్రిల్లర్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి హారర్, మిస్టరీ థ్రిల్లర్ అంశాలు నచ్చే ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్‌ను ఎంచక్కా చూసేయొచ్చు.

విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే హారర్ థ్రిల్లర్ జీ5 లో విడుదలైంది. అమ్మవారి శాపం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.