
గీతానంద్ మరియు మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వర్జిన్ బాయ్స్’ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
Key Points
‘వర్జిన్ బాయ్స్’ సినిమా రొమాంటిక్ పోస్టర్ విడుదల
జూన్ 25న సెకండ్ సింగిల్ ‘డమ్ డిగా డమ్’ పాట విడుదల
యువతకు నచ్చేలా రూపొందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
రొమాంటిక్ పోస్టర్ విడుదల
గీతానంద్, మిత్రా శర్మ(Mitra Sharma) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’(Virgin Boys). దయానంద్(Dayanand) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని నిర్మిస్తున్నారు. ఇందులో సుజిత్ కుమార్, రోనీత్, జెన్నిఫర్, అన్షు, అభిలాష్, బబ్లు, శ్రీహాన్ వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ట్వీట్ చేశారు. ‘వర్జిన్ బాయ్స్’ సెకండ్ సింగిల్ డమ్ డిగా డమ్ అని సాగే పాట జూన్ 25న ప్రసాద్ ల్యాబ్స్‌లో ఉదయం 10గంటలకు లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ రొమాంటిక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో ఓ జంట గట్టిగా హత్తుకుని కనిపించగా.. మరో జంట పడుకుని లిప్ కిచ్చ ఇచ్చుకుంటున్నారు. ఇక వాటిని చూసిన ఒక అమ్మాయి చెవులు, కళ్లు మూసుకుని కనిపిస్తుండగా.. ఓ అబ్బాయి ఆమె పక్కన నిల్చొని ఉన్నాడు. ఇక ఈ పోస్ట్‌కు చిత్రబృందం‘‘రేవింగ్ పార్టీ నంబర్ మీ ముందుకు వస్తోంది.. సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.
‘డమ్ డిగా డమ్’ పాట విడుదల తేదీ
‘వర్జిన్ బాయ్స్’ సినిమా విశేషాలు
‘వర్జిన్ బాయ్స్’ చిత్ర బృందం త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. రొమాంటిక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.


