|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైరల్: రష్మికకు అత్తగారి ప్రేమతో కూడిన బహుమతి! విరోష్ పెళ్లి వేడుకలో ఎమోషనల్ మూమెంట్!

Published: 25-02-2026, 5:05 AM
వైరల్: రష్మికకు అత్తగారి ప్రేమతో కూడిన బహుమతి! విరోష్ పెళ్లి వేడుకలో ఎమోషనల్ మూమెంట్!
  • విజయ్ దేవరకొండ, రష్మిక ఫిబ్రవరి 26న వివాహం చేసుకోనున్నారు.
  • రష్మికకు అత్తగారు తరతరాల బంగారు గాజులు బహుమతిగా ఇచ్చారు.
  • సంగీత్ వేడుకలో సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు సందడి చేశారు.
  • వివాహానికి ముందు విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. సంగీత్ వేడుకలో భాగంగా విజయ్ తల్లి రష్మికకు తన కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను బహుమతిగా ఇచ్చారు.

ఫిబ్రవరి 26న రష్మిక, విజయ్ వివాహం

Virosh Wedding: రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మరికొన్ని గంటలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. వీరి వివాహపు తేదీ ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం ఎంతో అంగరంగ వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో జరగబోతున్న సంగతి తెలిసిందే .ఇక 26వ తేదీ రష్మిక (Rashmika) విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నారు. విజయ్ రష్మిక ఇద్దరి సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహపు వేడుకలు జరగబోతున్నాయని తెలుస్తోంది.

మూడు రోజులపాటు వీరి పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం రష్మిక విజయ్ దేవరకొండ సంగీత్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సంగీత్ వేడుకలో భాగంగా పలువురు సెలబ్రిటీలతో పాటు ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో సంతోషంగా గడిపారని తెలుస్తోంది. ఇక ఈ సంగీత్ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ తల్లి మాధవి(Madhavi) రష్మిక కోసం ప్రత్యేకమైన కానుకలు కూడా అందించారని తెలుస్తుంది.

రష్మికకు అత్తగారి ప్రత్యేక కానుక

విజయ్ దేవరకొండ తల్లి మాధవి తన కుటుంబ వారసత్వంగా తరతరాలుగా వస్తున్న బంగారు గాజులను(Bangles) రష్మికకు సంగీత్ కార్యక్రమంలో కార్యక్రమంలో భాగంగా ఈ గాజులను అందజేయడంతో రష్మిక సైతం ఎంతో ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. ఇలా కుటుంబ వారసత్వంగా వస్తున్న గాజులను రష్మికకు అందచేయడమే కాకుండా తన ఇంటి కోడలుగా తనకు ఎంతో గౌరవాన్ని ఇవ్వడంతో రష్మిక కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇలా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహపు వేడుకలలో భాగంగా ఆ ప్రాంతం మొత్తం సంతోషకర వాతావరణ నెలకొందని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ రష్మిక తమ వివాహపు వేడుకను కేవలం ఒక వివాహంలా మాత్రమే కాకుండా తమ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే మధుర జ్ఞాపకంగా ఉండేలా ఈ పెళ్లి వేడుకను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆటపాటలతో ఈ వేడుకకు మరింత అందం తీసుకువచ్చారు. సంగీత్ కంటే ముందు ఈ జంట పెళ్లికి వచ్చిన అతిథులతో సరదాగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ మ్యాచ్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇలా ఆటపాటలతో వీరి వివాహపు వేడుకలు ఎంతో సంతోషంగా జరుగుతున్నాయి. గత రాత్రి సంగీత్ వేడుక పూర్తి కాగా, నేడు మెహందీ, హల్ది వేడుకలు జరగనున్నాయి. ఇక 26వ తేదీ ఉదయం ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

సంగీత్ వేడుకలో సందడి చేసిన కుటుంబ సభ్యులు

మొత్తానికి విజయ్, రష్మికల వివాహం ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోనుంది. ఇరువురి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.