|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vishal Brahma: రూ.40 కోట్ల మాదక ద్రవ్యాలతో దొరికిపోయిన బాలీవుడ్ నటుడు

Published: 01-10-2025, 8:16 AM
Vishal Brahma: రూ.40 కోట్ల మాదక ద్రవ్యాలతో దొరికిపోయిన బాలీవుడ్ నటుడు

బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దాదాపు రూ.40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డాడు. నైజీరియా ముఠాతో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అతని అరెస్ట్ సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Key Points

1

బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను రూ.40 కోట్ల డ్రగ్స్‌తో డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

2

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కాంబోడియా నుంచి వస్తుండగా డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు.

4

ఆర్థిక సమస్యల కారణంగా విశాల్ బ్రహ్మ ఈ నేరానికి పాల్పడినట్లు సమాచారం.

నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్: రూ.40 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయారు. ఈ మాదకద్రవ్యాల రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

నైజీరియా ముఠా పాత్ర: డ్రగ్స్ రవాణా వెనుక కుట్ర

కాగా.. అస్సాంకు చెందిన నటుడు విశాల్‌ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాల్లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం కొందరు స్నేహితుల  నైజీరియా ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు  సమాచారం. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్‌కు వెళ్లమని.. భారత్‌కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని ఆశ చూపినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

ఆర్థిక సమస్యలతో నేరమా? ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ నటుడు

కాగా.. రెండు వారాల క్రితమే ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. రిటన్ జర్నీలో ఓ నైజీరియన్‌ అతడికి ట్రాలీ బ్యాగ్‌ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్‌ ఉన్నట్టు సమాచారం. సింగపూర్‌ మీదుగా కాంబోడియా.. అక్కడి నుంచి చెన్నై.. చెన్నై నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలని నైజీరియా ముఠా అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విశాల్ బ్రహ్మ స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2 చిత్రంలో నటించారు.

విశాల్ బ్రహ్మ డ్రగ్స్ కేసులో మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. నైజీరియా ముఠా పాత్ర, ఇతర వ్యక్తుల ప్రమేయంపై డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ సంబంధాల వెనుక ఉన్న వాస్తవాలు త్వరలో బయటపడే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.