|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Guess The Actress: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ నటి

Published: 19-07-2025, 11:52 AM
Guess The Actress: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ నటి

ఒకప్పుడు టాలీవుడ్‌లో మెరిసిపోయిన నటి ప్రస్తుతం ఎలా ఉందో చూడండి! సిద్ధార్థ్ సినిమాతో పరిచయమైన ఈ నటి గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

నందిత జెన్నీఫర్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

2

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి, ఐటమ్ సాంగ్స్ ద్వారా నటిగా మారారు.

4

ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా జీవితం గడుపుతున్నారు.

నందిత జెన్నీఫర్: ఒక అరుదైన మార్పు

కొందరు బ్యూటీస్ ఒకటి రెండు సినిమాలు చేసినా సరే మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఈమె కూడా సేమ్ అలానే అనుకోవచ్చు. తమిళంలో చాలా మూవీస్ చేసినప్పటికీ తెలుగులో ఒకే ఒక్క మూవీతో ఫేమస్ అయింది. అందులో హీరో సిద్దార్థ్. మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు నందిత జెన్నీఫర్. తం‍డ్రి చిన్నా కొరియోగ్రాఫర్ కావడంతో ఈమె కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచింది. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఎంచుకుంది. 2000కి ముందు ఓ పక్క కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్‌లోనూ అడపాదడపా మెరిసేది. అలా దర్శకుల దృష్టిలో పడి ‘రిథమ్’ అనే సినిమాతో నటిగా మారింది. అలా 2022 వరకు పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.

సినిమా కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం

దాదాపు తమిళ సినిమాలే చేసినా ఈమె.. సిద్దార్థ్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో తెలుగులోకి పరిచయమైంది. డాలీ పాత్రలో తనదైన యాక్టింగ్ చేసి ఆకట్టుకుంది. మూవీ చూసినా ప్రతిసారి ఈమె పాత్ర కూడా నచ్చేస్తుంది. దీని తర్వాత పవిత్ర, వేర్ ఈజ్ విద్యాబాలన్, నా రూటే సెపరేట్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కనిపించింది.

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత జీవితం

జెన్నీఫర్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2007లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కాశీ విశ్వనాథన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇన్ స్టాలోనూ యాక్టివ్‌గానే ఉంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంది. అయితే అప్పట్లో సిద్ధార్థ్ సినిమాలో చూసినప్పటికీ ఇప్పటికీ ఈమెలో ఎంత మార్పు వచ్చేసింది. చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు కూడా!

నందిత జెన్నీఫర్ తన సినిమా జీవితం తర్వాత కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటోంది. తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.