
నటుడు విశాల్ తన 48వ పుట్టినరోజును నిశ్చితార్థంతో జరుపుకున్నాడు. నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని గతంలో ప్రకటించిన విశాల్, ఇకపై ముద్దు సన్నివేశాల్లో నటించే అవకాశం లేదని తెలిపాడు.
Key Points
విశాల్ 48వ పుట్టినరోజు వేడుకలు నిశ్చితార్థంతో సందడిగా జరిగాయి.
నడిగర్ సంఘం భవనం పూర్తయిన తర్వాతే పెళ్లి అంటూ విశాల్ ప్రకటన.
ఇకపై ముద్దు సన్నివేశాల్లో నటించనని విశాల్ ప్రకటించాడు.
ప్రస్తుతం 'మకుటం' సినిమాలో విశాల్ నటిస్తున్నాడు.
నిశ్చితార్థంతో సందడిగా విశాల్ బర్త్‌డే
‘నడిగర్ సంఘం భవనం పూర్తయినప్పుడే నా పెళ్లి’ అని శపథం చేశాడు స్టార్ హీరో విశాల్ ( Vishal ). దానికోసం తన వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు. నిన్న (ఆగస్టు 29న) విశాల్ 48వ బర్త్‌డే.. ఈ పుట్టినరోజే తన పెళ్లిరోజు కానుందని గతంలో ప్రకటించాడు. కానీ ఇంకా నడిగర్ సంఘం భవంతి పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. హీరోయిన్ సాయిధన్సిక వేలికి ఉంగరం తొడిగాడు.
చివరి బ్యాచిలర్ బర్త్‌డే.. నిశ్చితార్థం తర్వాత విశాల్ మాట్లాడుతూ.. ఇది నా చివరి బ్యాచిలర్ బర్త్‌డే. ఎంగేజ్‌మెంట్ విషెస్ చెప్పిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. తొమ్మిదేళ్లుగా నడిగర్ సంఘం భవంతి కోసం ఎదురుచూస్తున్నాం. ఇంకో రెండు నెలల్లో అది పూర్తయిపోతుంది. ఈ బిల్డింగ్ కోసం పనిచేస్తున్నప్పుడే ధన్సిక, నేను కలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కటి కాబోతున్నాం. మేమిద్దరం ఇంతవరకు ఏ సినిమాలోనూ జంటగా నటించలేదు.
నడిగర్ సంఘం భవనం పూర్తి తర్వాతే వివాహం
అలాంటి సీన్లు చేయను బిల్డింగ్ ప్రారంభోత్సవం అయిన మరుసటిరోజే నా పెళ్లి జరుగుతంది. నా బ్యాచిలర్ లైఫ్ ముగియబోతోంది. కాబట్టి నేను చాలా మారాలి. అలా అని రొమాంటిక్ సినిమాలు చేయననుకునేరు, చేస్తాను! కానీ ఇకమీదట ముద్దు సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చాడు. విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ మూవీ చేస్తున్నాడు. నిర్మాత ఆర్‌బీ చౌదరి కెరీర్‌లో ఇది 99వ చిత్రంగా రాబోతోంది. రవి అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విశాల్ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు.
ముద్దు సన్నివేశాలకు గుడ్‌బై
విశాల్ తన భవిష్యత్ కెరీర్‌లో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ‘మకుటం’ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


