|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశాల్‌, సాయి ధన్సిక మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా? ఇది అస్సలు ఊహించరు

Published: 20-05-2025, 12:21 AM
విశాల్‌, సాయి ధన్సిక మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా? ఇది అస్సలు ఊహించరు

సినిమా రంగంలో మరో ప్రేమ వివాహం జరుగబోతోంది. ప్రముఖ నటుడు విశాల్‌ మరియు నటి సాయి ధన్సిక ఆగస్టు 29న వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న వయస్సు తేడా, వారి స్నేహం, మరియు వివాహం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Key Points

1

విశాల్‌, సాయి ధన్సికల పెళ్లి ఆగస్టు 29న.

2

వీరిద్దరి మధ్య 12 ఏళ్ల వయస్సు తేడా ఉంది.

4

15 ఏళ్ల స్నేహం తర్వాత ప్రేమ వివాహం.

విశాల్‌, సాయి ధన్సికల ప్రేమకథ

సినిమా ఇండస్ట్రీలో నటులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సహజం. చాలా మంది సినిమాసెలబ్రిటీలు సినిమాల్లో నటించి రియల్‌ లైఫ్‌లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇప్పుడు వీరి జాబితాలో విశాల్, సాయి ధన్షిక కూడా  చేరారు.

సాయి ధన్సిక  `తంజావూరు“పేరన్మై` సినిమాతో పాపులర్ అయ్యారు. `కబాలి` సినిమాలో రజనీకాంత్ కూతురిగా నటించారు. ఈ మూవీతోనే తెలుగు ఆడియెన్స్ కి కూడా పరిచయం అయ్యారు ధన్సిక.

వారి వివాహం ఎప్పుడు?

విశాల్, సాయి ధన్సిక 15 ఏళ్లుగా స్నేహితులు. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజు. అదే రోజు వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతుండటం విశేషం.

విశాల్ కి 47 ఏళ్ళు. సాయి ధన్షికకి 35 ఏళ్ళు. వారిద్దరి మధ్య 12 ఏళ్ళు తేడా ఉంది.  సినిమాల్లో ఇలాంటి తేడా కామన్‌ అనే చెప్పొచ్చు.

వయసు తేడా ఎంత?

విశాల్‌ ప్రస్తుతం నడిఘర్‌ సంఘం భవనం నిర్మిస్తున్నారు. తన పెళ్లి లోపు ఆ భవనం పూర్తి అవుతుందట. అనంతరం ఆగస్ట్ 29న గ్రాండ్‌గా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ సినిమా ఈవెంట్లు వీరిద్దరు ప్రకటించిన విషయం తెలిసిందే.

విశాల్‌ మరియు సాయి ధన్సికల వివాహం సినీ ప్రేమికులకు మరపురాని రోజుగా నిలుస్తుంది. వారి సుదీర్ఘమైన స్నేహం ప్రేమగా మారి, వివాహంలో ముగియడం చాలా ఆనందదాయకం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.