|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశాల్‌, సాయి ధన్సిక లవ్‌ స్టోరీ వెనుక క్రేజీ డైరెక్టర్‌.. ఏడిపించి ప్రేమకి పునాది

Published: 21-05-2025, 12:14 AM
విశాల్‌, సాయి ధన్సిక లవ్‌ స్టోరీ వెనుక క్రేజీ డైరెక్టర్‌.. ఏడిపించి ప్రేమకి పునాది

విశాల్ మరియు సాయి ధన్సికల పెళ్లి ప్రకటన సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. వీరిద్దరి ప్రేమ కథ ఎలా ప్రారంభమయ్యిందో తెలుసుకుందాం.

Key Points

1

విశాల్, సాయి ధన్సికల పెళ్లి ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది.

2

టీ. రాజేందర్ వ్యాఖ్యల వల్ల సాయి ధన్సిక ఏడ్చిన సంఘటన వారి ప్రేమకు పునాది.

4

విశాల్ తన పుట్టిన రోజున సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నాడు.

విశాల్, సాయి ధన్సికల ఊహించని ప్రేమ

విశాల్‌, సాయి ధన్సిక ఊహించని విధంగా తమ పెళ్లి ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతకు ముందు విశాల్‌కి చాలా మందితో లవ్‌ ఎఫైర్‌ రూమర్స్ వచ్చాయి. కానీ ఎప్పుడూ సాయి ధన్సిక పేరు వినిపించలేదు. కానీ సడెన్‌గా ఆమె పేరు తెరపైకి రావడం ఆశ్చర్యపరిచింది. అంతే కాద  ‘యోగిత’ సినిమా ఆడియో వేడుకలో విశాల్, సాయి ధన్షిక తమ ప్రేమని ప్రకటిస్తూ పెళ్లి డేట్‌ని కూడా వెల్లడించారు. . ఈ ఈవెంట్‌  విశాల్, సాయి  ధన్సికల ఎంగేజ్‌మెంట్‌ వేడుకలా జరిగిందని, అందులో పాల్గొన్న దర్శకుడు పేరరసు  సరదాగా వ్యాఖ్యానించడం విశేషం.

విశాల్, సాయి ధన్సిక చాలా కాలం పాటు మంచి స్నేహితులుగా ఉన్నారు. కానీ ఇటీవలే ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. ఎట్టకేలకు వీరిద్దరు ఓపెన్‌ అయ్యారు. అందరిని ఆశ్చర్యపరుస్తూ మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. విశాల్‌ పుట్టిన రోజు  ఆగస్టు 29న మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు వెల్లడించడం విశేషం.  తన బర్త్ డే రోజే  తన ప్రియురాలిని పెళ్లాడబోతున్నారు విశాల్. పెళ్లయిన తర్వాత కూడా  సాయి ధన్సిక సినిమాల్లో నటిస్తుందని ‘యోగిత’ ఆడియో వేడుకలో విశాల్ చెప్పడం విశేషం.

టీ. రాజేందర్ పాత్ర

విశాల్, సాయి ధన్సిక ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. మరి ఈ ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారనేది ఆసక్తికరంగా మారింది.  దాని వెనుక ఒక సంఘటన ఉంది. 2017లో సాయి ధన్సిక నటించిన ‘విజితిరు’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టీ. రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ వేడుకలో సాయి ధన్సిక మాట్లాడుతూ టీ. రాజేందర్ పేరు చెప్పడం మర్చిపోయారు. దీన్ని వెంటనే గమనించిన టీఆర్ ఆమెని ఆటపట్టిస్తూ సరదా కామెంట్లు చేశారు.

టీ.రాజేందర్ మాటలకు సాయి ధన్సిక క్షమాపణ చెప్పారు. అయినా టీఆర్ ఆమెను ఆటపట్టిస్తూనే ఉన్నారు. అది కాస్త సీరియస్‌ వైపు టర్న్ తీసుకుంది. దీంతో సాయి ధన్సిక స్టేజ్‌ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  అప్పుడు ధన్సికకి సపోర్ట్ గా నిలిచారు విశాల్‌. టీ.రాజేందర్‌ను వ్యతిరేకిస్తూ విశాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

స్నేహం నుండి ప్రేమ వరకు

దీంతో విశాల్‌కు థ్యాంక్స్ చెప్పేందుకు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడింది ధన్సిక. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇలా విశాల్, ధన్సిక ప్రేమకు టీ రాజేందర్‌ కారణమయ్యారని చెప్పొచ్చు.

టీ రాజేందర్‌ కోలీవుడ్‌లో దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, రైటర్‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన శింబు ఫాదర్‌ కూడా అని అందరికి తెలిసిందే.

చివరగా, టీ. రాజేందర్ వల్ల ఏర్పడిన ఒక సంఘటన విశాల్ మరియు సాయి ధన్సికల ప్రేమకు పునాది వేసింది. వారి ప్రేమ కథ అందరికీ ప్రేరణ.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.