
హీరో విశాల్ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చే అవార్డులను చెత్తబుట్టలో వేస్తానని ప్రకటించాడు. తన నిశ్చితార్థం, కొత్త పాడ్‌కాస్ట్, యాక్షన్ సీన్లలో గాయాల గురించి కూడా తెలియజేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Key Points
విశాల్, సాయి ధన్సిక ఎంగేజ్‌మెంట్ చాలా సింపుల్‌గా జరిగింది.
'యువర్స్ ఫ్రాంకీ విశాల్' పేరుతో కొత్త పాడ్‌కాస్ట్ మొదలుపెట్టనున్నాడు.
యాక్షన్ సీన్ల కారణంగా విశాల్ శరీరానికి ఇప్పటివరకు 119 కుట్లు పడ్డాయి.
"అవార్డులు చెత్త, చెత్తబుట్టలో వేస్తాను" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
విశాల్ ఎంగేజ్‌మెంట్, కొత్త పాడ్‌కాస్ట్
కోలీవుడ్ హీరో విశాల్ (Vishal)తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసిన విశాల్ ప్రస్తుతం తగ్గించాడు. నిర్మాతగా మారి పలు చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అలాగే బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ కాబోతున్నాడు. గత కొద్ది కాలంగా సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నాడు. ఇక ఇటీవల ఆయన పుట్టినరోజు నాడు తన ప్రియురాలితో చాలా సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చాడు. ఇక పెళ్లి మాత్రం నడిగర్ సంఘం కోసం నిర్మిస్తున్న భవనం పూర్తి అయిన తర్వాత చేసుకుంటానని వెల్లడించారు. దీంతో అంతా విశాల్ పెళ్లి డేట్ ఎప్పుడెప్పుడు చెప్తాడా? అని ఎదురుచూస్తుండగా.. ఓ గుడ్ న్యూస్ వెల్లడించాడు. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశాడు.
యాక్షన్ సీన్స్‌లో గాయాలు, 119 కుట్లు
త్వరలోనే కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. ‘యువర్స్ ఫ్రాంకీ విశాల్’ పేరుతో పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ విషయం చెబుతూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నా శరీరంపై ఇప్పటివరకు 119 కుట్లు పడ్డాయి. చాలాసార్లు గాయపడ్డాను. కానీ నేను చేసిన యాక్షన్ సీన్స్‌కు ప్రేక్షకులు ఇచ్చే స్పందన చూసి వాటన్నింటిని మర్చిపోతాను. నా సినిమాల్లో డూప్ వాడకపోవడం వల్ల నేను నటించే యాక్షన్స్ సీన్స్ వల్ల ఇలా జరిగింది. నేను చేసే స్టంట్స్ రియలిస్టిక్‌గా ఉండాలని కోరుకుంటాను. డూప్ అవసరం అనిపించినా నేనే చేస్తాను. ప్రమాదం జరుగుతుందనే భయం ఉండదు. కానీ సేఫ్టీ మెజర్స్ తప్పకుండా తీసుకుంటాం.అయినప్పటికీ ఎన్నో కుట్లు పడ్డాయి.
“అవార్డులు చెత్త.. చెత్తబుట్టలో వేస్తాను”: విశాల్
యాక్షన్ సీన్‌లో చేతికి లోతైన గాయం కావడంతో 17కుట్లు వేశారు’’ అని చెప్పుకొచ్చాడు. అలాగే అవార్డుల గురించి మాట్లాడుతూ.. నాకు అవార్డులంటే నమ్మకం లేదు. అవార్డులు అంటే చెత్త. 8 కోట్ల మందికి ఏం నచ్చుతుందో 8 మంది నిర్ణయించలేరు. జాతీయ అవార్డులతో సహా అన్నింటినీ నిర్ణయించడం 8 మంది వల్ల కాదని నేను చెబుతున్నాను. నాకు అవార్డులు రావు కాబట్టి ఇలా అనడం లేదు. వాళ్ళు అవార్డులు ఇస్తే, నేను చెత్తబుట్టలో వేస్తాను’’ అని అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విశాల్ అవార్డులను చూసుకుని మురిసే హీరోలను ఉద్దేశించే అన్నాడని చర్చించుకుంటున్నారు.
విశాల్ చేసిన అవార్డుల వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆయన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన సవాళ్లను ధైర్యంగా పంచుకోవడం విశాల్ ప్రత్యేకతను చాటుతుంది. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.


